మండే ఎండలో పుచ్చకాయ తింటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. దీనిలో నీటిశాతం అధికంగా ఉంటుంది. కాబట్టి వేసవిలో డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది. అంతే కాదు పుచ్చకాయలో విటమిన్ సి, విటిమన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఎ లు అధికంగా ఉన్నాయి. వీటితో పాటు పొటాషియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి హార్ట్ కు మరియు స్టమక్ కు ఇవి చాలా బాగా సహాయపడుతాయి. అందువల్ల దీనిని వేసవిలో ఎక్కువగా తినాలి.
ముఖ్యంగా ప్రెగ్నెన్సీ మహిళలు దీన్ని ఎక్కువగా తీసుకోవాలి. గర్భిణీలు పుచ్చకాయను తినడం వల్ల మలబద్దకం కూడా తగ్గుతుంది. సహజంగా గర్భిణీలు హార్ట్ బర్న్, ఎసిడిటి వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలను నివారించడంలో పుచ్చకాయ చక్కగా సహాయపడుతుంది. పుచ్చకాయతో హార్ట్ బర్న్ నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. గర్భిణీల శరీరంలో సహజంగా వచ్చే కాళ్లు, పాదాలు, చేతుల వాపులను తగ్గించడంలో కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది.
గర్భిణీల్లో పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించుకోవడంలో పుచ్చకాయ బాగా సహాయపడుతుంది. చర్మంలో మెరుపు తీసుకొస్తుంది. పుచ్చకాయలో ఎక్కువ నీరు ఉండటంతో పాటు డ్యూరియాటిక్ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో హానికరమైన టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. లివర్ ను శుభ్రం చేస్తుంది. రక్తంలో యూరిక్ యాసిడ్స్ ను తగ్గిస్తుంది.
పుచ్చకాయ జ్యూస్ ను రోజూ ఒక గ్లాసు తాగడం వల్ల రోజంతా శరీరంను చల్లగా మరియు రిఫ్రెషింగ్ గా ఉంచుతుంది. శరీరంలో ఎనర్జీ మరియు న్యూట్రీషినల్ విలువలు పెరుగుతాయి. దాంతో మార్నింగ్ సిక్ నెస్ తగ్గుతుంది. గర్భిణీ మహిళలకు డీహైడ్రేషన్ కారణంగా ప్రీమెచ్యుర్ బర్త్ తగ్గుతుంది. అందువల్ల ఎక్కువగా నీరు తాగాల్సి ఉంటుంది. డీహైడ్రేషన్ తగ్గించడంలో పుచ్చకాయ బాగా సహాయపడుతుంది.
ఇవి శరీరానికి నేచురల్ ఎనర్జీని అందిస్తాయి. బేబీ కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాధినిరోధకతను పెంచుతుంది. నెర్వెస్ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది. పుచ్చకాయలో లైకోపిన్ లెవల్స్ అధికంగా ఉంటాయి.