చర్మ సంరక్షణ అంటే ముందుగా ముఖ సౌందర్యమే. అందం అంటే ముఖం మాత్రమే అందంగా కనిపించడం అని చాలామంది భావిస్తుంటారు. అందుకే ముఖంపైనే ఎక్కువ శ్రద్ధగా చూపిస్తారు. నిజానికి వయస్సు పెరగే కొద్ది ఆ లక్షణాలు కేవలం ముఖంపై మాత్రమే కనిపించవు. చేతులు, కాళ్లు ముడుతలుగా ఏర్పడటం అందులో ముఖ్యమైన సమస్య.
కొవ్వు బదిలీ పద్ధతిలో, కొవ్వు కణాలు కడుపు లేదా తొడ వంటి శరీర భాగం నుండి తీసుకోని వాటిని ప్రాసెస్ చేసి రోగి చేతిలో ఇంజెక్ట్ చేస్తారు. ఏదైనా సమస్య వచ్చిన తరువాత పరిష్కారం వెతికే కంటే ఆ సమస్య రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక్కడ కూడా అంతే. అసలు చేతులు ముడతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
- పొడిగా ఉన్న చేతులకి మాయిశ్చరైజర్ అప్లై చేయడం మర్చిపోకండి.
- ఇంటి నుండి బయటకి వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ లోషన్ మర్దన చేసుకోండి.
- రాత్రిపూట పడుకునే ముందు విటమిన్ సి, ఈ, బీ3 గల సీరమ్స్ అప్లై చేసుకోవాలి.
- ఈ పద్దతులన్నీ చేతుల మీద ముడుతలు పోగొట్టడానికి బాగా సాయపడతాయి.