Home Health హోమ్ రెమెడీస్ ద్వారా హ్యాంగోవర్ నుండి ఎలా బయట పడవచో తెలుసా ?

హోమ్ రెమెడీస్ ద్వారా హ్యాంగోవర్ నుండి ఎలా బయట పడవచో తెలుసా ?

0

మద్యం సేవించటం అనేది మోడ్రన్ కల్చర్ లో భాగంగా ఒక ఫ్యాషన్ గా మారింది. అయితే మద్యాన్ని చాల మంది ఖాళీ కడుపుతో తాగుతారు.. ఇలా ఖాళీ కడుపుతో తాగడం అనేది మంచి అలవాటు కాదు.. ఇది ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది.. కొన్ని సార్లు హ్యాంగోవర్ కు దారితీస్తుంది.. ఈ హ్యాంగోవర్ అనేది మద్యం తాగేవాళ్ళకి కలిగే సమస్యల్లో ఒకటి.. కొన్ని హోమ్ రెమెడీస్ తో ఈ హ్యాంగోవర్ నుండి బయటపడవచ్చు. మరి అవేంటో ఇపుడు చూద్దాం..

Hangoverముఖ్యంగా ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు ఏదో ఒక ఆహారం తీసుకోవాలి .. ఇలా చేయటం వలన ఆల్కహాల్ ప్రభావం మీ జీర్ణాశయంపై పడదు. కడుపు ఫుల్ గా ఉన్నప్పడు, ఆకలి లేనప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితం.. మద్యం తాగక హ్యాంగోవర్ తో ఇబ్బంది పడేవారికి టమాటో ఒక పరిష్కారం.. టమోటాలలోని లైకోపీన్ శరీరంలో మంటను తగ్గించడానికి పనిచేస్తుంది, మరియు శరీర ద్రవాల యొక్క సరైన సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. హ్యాంగోవర్ ఇబ్బంది పెడితే రెండు తొంటలు తినటం కానీ.. టమాటో జ్యూస్ కానీ తాగి చుడండి..

తరచూ హ్యాంగోవర్ కి గురయ్యే వారు మద్యం సేవించే ముందు ఊరగాయ తినటం మంచిది.. ఎందుకంటే ఇది హ్యాంగోవర్లను నిరోధించే ఎలక్ట్రోలైట్ మరియు సోడియం స్థాయిలను రీహైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. మద్యపాన వాళ్ళ కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించటానికి ఓట్స్ కూడా ఉపయోగపడతాయి.. ఓట్స్ ఫైబర్ మరియు ప్రోటీన్ స్థాయిలను కలిగి ఉంటుంది.. ఆల్కహాల్ వల్ల కాలేయానికి కలిగే నష్టం నుండి రక్షించడం అలాగే కాలేయ పనితీరును మెరుగుపరచడానికి కూడా ఓట్స్ గొప్పగా తోడ్పడతాయి.

ఆల్కహాల్ తాగినప్పుడు శరీరంలో విటమిన్ బి యొక్క మోతాదు తగ్గుతుంది. కాబట్టి మీ బి-విటమిన్లను పెంచడంలో హమ్ముస్ సహాయపడుతుంది. హమ్మస్‌లోని అమైనో ఆమ్లాలు హ్యాంగోవర్‌ ను నివారించడంలో సహాయపడతాయి..కాక్టస్ జ్యూస్ మీ కడుపులో సన్నని రక్షిత లైనింగ్ ఏర్పడటానికి సహాయపడుతుంది, తద్వారా ఆల్కహాల్ తాగినప్పుడు కలిగే బర్నింగ్ సెన్సేషన్ రాకుండా చేస్తుంది. అందువల్ల బార్ కు వెళ్లి భరీగా తాగేముందు అర గ్లాసు కాక్టస్ రసం తీసుకోండి. ఇది మీ ఆరోగ్యానికి చాల మంచిది. అలాగే మద్యం సేవించే ముందు గుడ్డు ను తినడం చాల మంచిది .

గుడ్డులో ప్రోటీన్ అధికంగా ఉండటమే కాకుండా, సిస్టీన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది, ఇది ఆల్కహాల్ లోని టాక్సిన్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.. తద్వారా హ్యాంగోవర్లకు గురి కాకుండా ఉండవచ్చు.. అలాగే అరటి పండు.. అరటిపండు లో పొటాషియం అధికంగా ఉంటుంది. తద్వారా మీరు మద్యం సేవించే ముందు అరటిపండ్లు తినడం వల్ల మీ శరీరం లోని ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను బాలన్స్ చేస్తుంది… అంతే కాదు.. మద్యాన్ని రక్తలోకి ప్రవేశించకుండా సహాయపడుతుంది..

హ్యాంగోవర్ ని తగ్గించటంలో అవోకాడో కూడా సహాపడ్తుంది.. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అవోకాడోలు ఆరోగ్యకరమైన కొవ్వు ని కలిగిఉంటాయి.. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది మద్యాన్ని రక్తలోకి ప్రవేశించకుండా చేస్తుంది..ఆస్పరాగస్ అమినాఆసిడ్స్ అధికంగా ఉన్నటువంటి ఒక హెల్తీ ఫుడ్ . ఆస్పరాగస్ లో అమైనో ఆమ్లాలు జీవక్రియకు సహాయపడతాయి. ఈ యాసిడ్ మద్యం జీర్ణం అవ్వడానికి మరియు మద్యం తాగినప్పుడు కాలేయ కణాలను రక్షించడానికి సహాయపడుతుంది.

మద్యం సేవించే ముందు ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ని నీటిలో కలిపి తాగడం వల్ల కూడా హ్యాంగోవర్లను నివారించవచ్చు. ఇది శరీరం యొక్క పీహెచ్ స్థాయిలను బాలన్స్ చేయడానికి సహాయపడుతుంది.

Exit mobile version