పురాణాల ప్రకారం, బ్రహ్మ దేవుడికి ఎలాంటి ఆలయాలు ఉండవు అనే ఒక శాపం ఉంది. శాపము ఉన్న బ్రహ్మ కి ఈ ఆలయంలో శివుడిని కలిపి ఒకేమూర్తిగా ఎందుకు ప్రతిష్టించారు? అసలు ఈ బ్రహ్మ లింగేశ్వరాలయం నిర్మించాలని ఎందుకు భావించారు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, గుంటూరు జిల్లా, చేబ్రోలు గ్రామం నందు కోనేటిలో చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం కలదు. ఇక్కడ బ్రహ్మ శివుడు కొలువై ఉండటం వెనుక ఒక పురాణం ఉంది. అయితే పూర్వం అమరావతి ప్రాంతాన్ని రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పాలించే కాలంలో దోపిడీ దొంగల తాకిడితో ప్రజలు అల్లాడిపోసాగారు. ఆ దొంగలు చెడు మార్గాన్ని వీడి తనకి లొంగితే వారికీ ఎలాంటి కీడు తలపెట్టాను అని అయన అన్నం మీద ఒట్టేసి ప్రమాణం చేసాడు. అయన మాటలు నమ్మిన దొంగలు లొంగిపోయారు కానీ, రాజు తన మాట నిలబెట్టుకోలేక వారిని వధించాడు. ఆ తరువాత నుండి అయన భోజనం చేసేప్పుడు అన్నం అంత రక్తం ఓడుతూ కనిపించడం మొదలైంది. దీంతో రాజావారు బయపడి వేద పండితులను సంప్రదించాడు. అయితే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలంటి అన్నం మీద ఒట్టేసి అపరాధం చేసారు. దోషపరిహారార్థం బ్రహ్మదేవాలయం కట్టించాలని పండితులు సూచించారు.అయితే ఇక్కడ వారికీ వచ్చిన చిక్కు ఏంటంటే, శివుడి శాపకారణంగా బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండటానికి వీలు లేదు. అపుడు వారు శాస్రాలను తిరగేసి బ్రహ్మతో కలిపి శివుడిని ఒకేమూర్తిగా ప్రతిష్ఠిస్తే ఎలాంటి దోషం ఉండదని చెప్పగా, అలా నిర్మితమైనదే ఈ ఆలయం. బ్రహ్మదేవుడు కమలగర్భుడు కనుక ఒక కమలంలో ఓ సృష్టికర్త నాలుగు ముఖాలు ఉండి పైన శివలింగాకృతి వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఆ మూర్తిని కోనేరులో ప్రతిష్టించారు. అయితే దీనికి కూడా ఒక కథ చెబుతారు. ఆగమాల ప్రకారం శివాలయానికి ఎదురుగా, విష్ణుమూర్తి గుడికి వెనుకబాగంలోను, అమ్మవారి ఆలయానికి పక్కభాగంలోను ఈ నిర్మాణము ఉండకూడదు. మరి బ్రహ్మ ఆలయం గురించి ఏ ఆగమంలోను లేదు. దాంతో ఏ దోషం అంటకుండా ఇలా కోనేటి నడి మధ్యలో నిర్మించారు. పురాణాల ప్రకారం బ్రహ్మకు అర్హతలేదు కనుక పరోక్షంగా ఈశ్వరునికి అభిషేకం చేసి అది బ్రహ్మకు చెందేలా రూపొందించబడటం ఈ ఆలయం ప్రత్యేకత.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.