Home Unknown facts ఎవరి శాపం వల్ల మహిషాసురుడు స్త్రీ చేతిలో మరణించాడు?

ఎవరి శాపం వల్ల మహిషాసురుడు స్త్రీ చేతిలో మరణించాడు?

0
మహిషాసురుడిని వధించిన నాటి నుండి అమ్మవారు మహిషాసుర మర్దిని దేవిగా చాలా ప్రాంతాల్లో పూజలు అందుకుంటుంది. అందుకే ఆ పూజను మహిషఘ్నీ పూజ అని కూడా అంటారు. మన పురాణాల ప్రకారం ఆదిశక్తి మహిషాసుర అనే రాక్షసుని వరించడం చేత ఆమెకు మహిషాసురమర్దిని అనే పేరు చేత పూజిస్తారు అనే విషయం మనకు తెలిసిందే.
  • ఎంతో శక్తిశాలి అయిన మహిషాశురుడు ఆడవారి చేతిలో చనిపోవడానికి గల కారణం ఏమిటి అనే  విషయాన్ని  తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దనువు పుత్రులైన రంభకరంభులనే వారు సంతానంకోసం ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేశారు.
  • కరంభుడు నీటిలో పరమేశ్వరుడి కోసం తపస్సు చేయగా, రంభుడు చెట్టుపైన కూర్చుని తపస్సును కొనసాగించారు. ఈ క్రమంలోనే ఇంద్రుడు నీటిలో నుంచి ఒక ముసలి రూపంలో వచ్చి కరంభుడుని సంహరించాడు. ఈ విధంగా తన సోదరుడు మృతి చెందడంతో ఆగ్రహం చెందిన రంభుడు తాను కూడా తన తల నరుక్కొని ఆ బోలా శంకరుడుకి అర్పించాలని సిద్ధమయ్యాడు.
  • ఈ క్రమంలోనే  తన తలను నరకబోతుండగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెబుతారు. ఈ క్రమంలోనే రంభుడు పుత్రసంతతిలేని నాకు నువ్వే మూడు జన్మల పుత్రునిగా జన్మించాలి. నాకు పుట్టే ఈ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేదవేదాంగవిధుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావలి అనే వరం కోరుకోగా అందుకు పరమేశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు.
  • ఈ క్రమంలోనే పరమేశ్వరుని దగ్గర వరం పొంది ఇంటికి వెళ్తున్న రాముడు మార్గమధ్యంలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశంతో మహిషిని గర్భంలోకి ప్రవేశించి మహిషాకారంతో బిడ్డ జన్మించాడు. అతడే మహిషాసురుడు. ఈ విధంగా పుట్టిన మహిషాసురుడు ఎంతో బలశాలి. ఏకంగా ఇంద్రుడిని చేయించి ముల్లోకాలను ఏలుతూ అందరిని గజగజలాడిస్తున్నాడు.
  • ఈ క్రమంలోనే మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షిశిష్యుని బాధిస్తూ వుండడంతో కోపోద్రిక్తుడైన మహర్షి మహిషాసురుడికి స్త్రీ చేతిలోనే నీకు మరణం సంభవిస్తుందని శపించాడు. ఈ విధంగా మహర్షి శాపం పొందినప్పటికీ అతనిలో ఏ మాత్రం మార్పు లేకుండా సాధుపుంగవులని, దేవతలనీ, ఋషులను బాధిస్తూనే వచ్చాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించడంతో ఆమె ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది.

Exit mobile version