Home Health సగ్గు బియ్యం ఎలా తయారు చేస్తారో తెలుసా?

సగ్గు బియ్యం ఎలా తయారు చేస్తారో తెలుసా?

0
సగ్గు బియ్యాన్ని మనదేశంలో వివిధ రకాల వంటకాలలో వినియోగిస్తుంటారు.  సగ్గుబియ్యంని ఛౌవ్వరి, సగుదనా, అవ్వరిషిగా ప్రసిద్ది. ఆ గింజలతో కిచిడీ చేసుకోవచ్చు. వడలు అలాగే ఖీర్ మరియు పాయసం చేసుకోవచ్చు. ఉపవాస సమయాల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. 100 గ్రాముల సగ్గుబియ్యం లోని 351 కె కాలరీలు, 87 గ్రాముల కార్బోహైడ్రేట్స్ 0.2 గ్రాముల కొవ్వు మరియు 0.2 గ్రాముల ప్రొటీన్లు కలవు. ఇందులో తక్కువ మొత్తం లో మినరల్స్, విటమిన్స్, కాల్షియం, ఐరన్ మరియు ఫైబర్ కలవు.
  • అలాగే పండుగల సమయం లో కూడా వీటిని వాడతారు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తూ కొవ్వు తక్కువగా ఉండే పదార్ధం ఇది. బరువు తగ్గాలని అనుకునే వారు కూడా ఈ ఆహారాన్ని తీసుకోవచ్చు. పాలు తరువాత చిన్న పిల్లలకి తినిపించదగిన ఆహార పదార్ధం ఇది.  రోగులకు కూడా ఇది తక్షణ శక్తి నిచ్చే ఆహార పదార్ధంగా దీనిని వాడతారు. అలాగే ఒంట్లో వేడిని తగ్గించే లక్షణం ఇందులో ఉన్నందువల్ల దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. స్టార్చ్ శాతం ఎక్కువగా ఉండి కృత్రిమ తీపి పదార్ధాలు, రసాయనాలు లేకపొవడం వల్ల సగ్గు బియ్యాన్ని ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పుకోవచ్చు.
  • మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి సగ్గు బియ్యం ఎంతో తోడ్పడుతుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్-బీ వల్ల శరీరానికి ఎంతో మేల చేస్తుంది. గర్భిణులు, శిశువులకు సగ్గు బియ్యం ఎంతో శ్రేయస్కరం. ఎముకలు ధృడంగా ఉండేందుకు మేలు చేసే కాల్షియం, విటమిన్-కే వంటివి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి.. అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది.
  • అయితే చాలా మందికి సగ్గు బియ్యంపై ఒక అపోహా వుంది. సగ్గు బియ్యం మాంసాహారమని కాని ఇంత మాత్రం నిజం కాదు. సగ్గుబియ్యాన్ని కర్ర పెండలం అనే దుంపతో తయారు చేస్తారు. భూమిలో నుంచి బయటకు తీసిన కర్ర పెండలం దుంపలను 24 గంటల్లో సగ్గు బియ్యం కేంద్రానికి చేరవేయవలిసి ఉంటుంది.  ఆ దుంపలను నీటి తో బాగా శుభ్రంచేసి దానిపై ఉన్న  తొక్కను యంత్రాలతో వేరుచేస్తారు. తొక్క తీసిన దుంపలను మరొక్కసారి నీళ్ళ తో శుభ్రం  చేస్తారు. తర్వాత ఆ దుంపలను క్రషర్ లో పెట్టి పాలను తీస్తారు. అలా  వచ్చిన పాలు ఫిల్టర్ లలోనికి, అక్కడి నుండి సర్క్యులేటింగ్ చానల్స్ లోనికి వెళ్లేలా ఏర్పాటుచేస్తారు . ఈ క్రమం లో, పాలలోని చిక్కని పదార్థం ఒక ముద్దలా ఉంటుంది. దాని నుండే  సగ్గు బియ్యం తయారు అవుతుంది.
  • ఇక ఈ పిండి వివిధ రకాల పరిమాణంలో రంద్రాలున్న జల్లెడ లాంటి పాత్రలోకి చేరుతుంది. ఆ జల్లెడ అటు ఇటు కదలడం వలన ఆ జల్లెడ రంద్రాలనుండి తెల్లటి పూసల్లాగా జలజలా రాలి పడుతుంటుంది. అలా పడినప్పుడు అవి మెత్తగా వుంటాయి. వాటిని పెద్ద పెనం మీద వేడి చేసి తరువాత వాటిని ఎండలో ఆర బెడతారు. 100 కిలోల సగ్గుబియ్యం కావాలంటే  సుమారు 500 కిలోల దుంపలను వాడాల్సి ఉంటుంది. ఈ విధానంలో సగ్గుబియ్యం తయారు చేస్తారు.
  • ఇక సగ్గుబియ్యం ఎలా వండాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే సగ్గుబియ్యం అంటే స్టార్చ్ పదార్ధం కాబట్టి వండటం సులువు కాదు. ప్రత్యేకించి నీల్లతో వండటం సులువు కాదు. సగ్గుబియ్యాన్ని వండే ముందు నీళ్ళతో బాగా కడగాలి. ఆ తరువాత బాగా వడగట్టి వెడల్పాటి గిన్నెలొ ఉంచాలి. గిన్నెలో సరిపడా నీళ్ళు పొయ్యాలి. ఆ తరువాత ఆ గిన్నెకి మూత పెట్టాలి. నాలుగు నుండి ఆరు గంటల పాటు నాననివ్వాలి. ఆ తరువాత వాటితో నచ్చిన వంటకం చేసుకోవచ్చు.

Exit mobile version