Home Unknown facts అమ్మవారి శేష వస్త్రాన్ని ధరిస్తే కలిగే లాభాలేంటి? పాటించాల్సిన నియమాలేంటి?

అమ్మవారి శేష వస్త్రాన్ని ధరిస్తే కలిగే లాభాలేంటి? పాటించాల్సిన నియమాలేంటి?

0

మన దేశంలో దేవాలయాలకు కొదువే లేదు. అందులోనూ అమ్మవారి ఆలయాలైతే వీధికొకటి దర్శనమిస్తాయి. తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని, తమ మంగళ్యాన్ని కాపాడమని మహిళలు అమ్మవారి ఆలయాలకు క్యూ కడుతూ ఉంటారు. మరి గుడికి వెళ్తే వట్టి చేతులతో వెళ్తారా… పూలు, పండ్లు కొబ్బరికాయలు తీసుకెళ్తుంటారు. వాటితో పాటు పూలు, కుంకుమ, గాజులు, చీరె, రవికెలను కానుకలుగా సమర్పిస్తుంటారు. ఆ చీరెను విశేషమైన రోజుల్లో ఆ చీరను మూలమూర్తికి అలంకరింప చేయమని పూజారులకు చెబుతుంటారు.

అమ్మవారిఆ తరువాత ఇలాంటి చీరెలను ఆలయ నిర్వాహకులు భక్తుల సమక్షంలో వాటిని వేలం వేస్తుంటారు. ఆ చీరె దక్కితే చాలని చాలా మంది భక్తులు వేలంలో కొనుక్కుంటుంటారు. కానీ సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి అలంకరింప చేసిన శేష వస్త్రాన్ని భక్తులు ధరించవచ్చా..? అలా ధరిస్తే కలిగే లాభాలేంటి? పాటించాల్సిన నియమాలేంటి?తెలుసుకుందాం.

అమ్మవారి చీరెలను ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. కానీ, ధరించినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందట. ఎంత సంతోషంగా వేలం పాటలో సొంతం చేసుకుంటామో.. ఆ చీరెను ధరించినప్పుడు కూడా అంతే పవిత్రంగా ఆ మహిళలు ఉండాలి. అందుకు కొన్ని నియమాలను పాటించాలని అంటున్నారు పండితులు.

అమ్మవారి శేష వస్త్రాన్ని ధరించే ముందు తిథి – వర్జ్యం చూసుకుని “శుక్రవారం” రోజున అమ్మవారి చీరను ధరించవచ్చు. అది కూడా ఉదయం వేళలో కొంతసేపు మాత్రమే ధరించాలి. ఈ చీరెను ధరించినంత సేపు ప్రశాంతత కలుగుతుంది. అలాగే మనం కూడా ప్రశాంతంగా ఉండాలి. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. రాత్రి సమయాల్లో ఈ చీరెను ధరించ కూడదు. ఆ చీరెను ఎప్పుడు ఉతికినా ఆ నీటిని ఎక్కడపడితే అక్కడ కాకుండా మొక్కలకు పోయవలసి వుంటుంది.

అప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలా కాకుండా నియమాలను పాటించకపోతే, ఫలితం ఉండదు. ఆ పవిత్రత మనకు దక్కదు. పుణ్యక్షేత్రాల్లోని అమ్మవారి ఆలయంలో లభించిన వస్త్రమైనా, మారుమూల గ్రామంలోని అమ్మవారి ఆలయంలో లభించిన వస్త్రమైనా పవిత్రత విషయంలో ఒకే విధమైన నియమాలను పాటించవలసి వుంటుంది.

Exit mobile version