ప్రస్తుత బిజిబిజీ గందరగోళ కాలంలో ఎక్కడ చూసినా గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో జనాలకు స్వచ్ఛమైన గాలి లభించడం లేదు. ఫలితంగా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. స్వచ్ఛమైన గాలి కోసం పార్కుల వెంట పరుగులు పెడుతున్నారు. అయితే స్వచ్ఛమైన గాలికోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు.
ఇంట్లో ఉంటూనే స్వచ్ఛమైన గాలిని పీల్చేందుకు యత్నించాలి. అందుకు గాను పరిసరాల్లోని కొన్ని మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి మన ఇంట్లోని గాలిని ఫిల్టర్ చేస్తాయి. దీంతో మనకు ఇంట్లో స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఆ మొక్కలు ఏంటో తెలుసుకుందాం…
అలోవెరా :
మొక్క మంచి ఆయుర్వేద ఔషధంగా అందరికీ తెలుసు. అయితే ఈ మొక్క గాలిని కూడా శుద్ధి చేస్తుంది. దీన్ని ఇళ్లలో పెంచుకుంటే స్వచ్ఛమైన గాలిని పీల్చవచ్చు.
మనీ ప్లాంట్ :
వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకుంటే ధనం లభిస్తుందని చెబుతారు. కానీ నిజానికి ఈ మొక్క గాలిని కూడా శుభ్రం చేస్తుంది. గాలిలో ఉండే బెంజీన్, ఫార్మాల్డిహైడ్, జైలీన్, టోలీన్ వంటి కాలుష్య కారకాలను నిర్మూలిస్తుంది. తద్వారా స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది.
స్నేక్ ప్లాంట్ :
మొక్క రాత్రి సమయంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. దీని వల్ల గాలిలో ఉండే బెంజీన్, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరోఎథిలీన్, జైలీన్, టోలీన్ వంటి కాలుష్య కారకాలు నిర్మూలింపబడతాయి. ఫలితంగా స్వచ్ఛమైన గాలిని పీల్చవచ్చు.
పీస్ లిల్లీ :
పీస్ లిల్లీ మొక్కకు తెలుపు రంగులో అందమైన పూలు పూస్తాయి. ఈ మొక్క ఎయిర్ ప్యూరిఫైర్ గా పనిచేస్తుంది. గాలిలో ఉండే కాలుష్య కారకాలను 60 శాతం వరకు తగ్గిస్తుంది. అలాగే ఆల్కహాల్, ఎసిటోన్ తుంపర్లను కూడా నిర్మూలిస్తుంది.
అరికా పామ్ :
అరికా పామ్ మొక్క కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల మన చుట్టూ ఉండే పరిసరాల్లోని వాతావరణం శుభ్రమవుతుంది. హానికరమైన కాలుష్య కారకాలు తొలగింపబడతాయి. స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.