Home Health తరుచూ శానిటైజర్ వాడటం వల్ల చేతులు పొడిబారిపోతున్నాయా?

తరుచూ శానిటైజర్ వాడటం వల్ల చేతులు పొడిబారిపోతున్నాయా?

0

కరోనా కారణంగా తరచూ హ్యాండ్ వాష్ చేసుకోవడం లేదా శానిటైజర్ రాసుకోవడం అందరికీ అలవాటయింది. అయితే దీని వల్ల చేతులు పొడిబారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు అంట్లు తోమడం, వంట చేయడం లాంటి పనుల వల్ల చేతులు మరింతగా పొడిబారుపోతుంటాయి. అలాంటప్పుడు కొన్ని హ్యాండ్ మాస్కులు ట్రై చేయడం వల్ల చేతులు చాలా సాఫ్ట్ గా తయారవుతాయి. అవెలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Consequences of trying on hand masksకొబ్బరి నూనె మాస్క్:

కావాల్సినవి : కొబ్బరి నూనె, రెండు టవల్స్.

స్టెప్ 1: రెండు చేతులకు, వేళ్లకు, గోర్లకు కొబ్బరి నూనె రాసుకోవాలి.
స్టెప్ 2: ఒక్కో చేతికి ఒక్కో టవల్ చుట్టుకుని ఐదు నిమిషాలుండాలి. దీనివల్ల నూనెను చర్మం పీల్చుకుంటుంది.
స్టెప్ 3: చేతికి చుట్టిన టవల్స్ తీసేసి టిష్యూ పేపర్ తో చేతులను తుడుచుకోవాలి.(చేతులను వాష్ చేసుకోవద్దు.)
స్టెప్ 4: కొన్ని నిమిషాలు ఆగిన తర్వాత హ్యాండ్ క్రీం రాసుకోవాలి.
కొబ్బరి నూనె వాడటం ఇష్టం లేని వారు దీనికోసం ఆల్మండ్ ఆయిల్ ఉపయోగించవచ్చు.

క్యారెట్ హ్యండ్ మాస్క్:

కావాల్సినవి: క్యారెట్, ఆలివ్ నూనె, వెన్న.

స్టెప్ 1: క్యారెట్, వెన్న, ఆలివ్ నూనె కలిపి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
స్టెప్ 2: క్యారెట్ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకోవాలి.
స్టెప్ 3: 20 నిమిషాల తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి.

కావాల్సినవి: ఫ్రెష్ కలబంద గుజ్జు, షుగర్ స్క్రబ్, ప్లాస్టిక్ గ్లవ్స్

స్టెప్ 1: ముందుగా చేతులను షుగర్ స్క్రబ్ అప్లై చేసుకుని సున్నితంగా రుద్దుకోవాలి.
స్టెప్ 2: స్క్రబ్ చేసుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకోవాలి.
స్టెప్ 3: ఇప్పుడు అలోవెరా గుజ్జును చేతులకు అప్లై చేసుకుని ప్లాస్టిక్ బ్యాగ్ లేదా గ్లవ్స్ తొడుక్కుని ఓ పది నిమిషాలు ఉండాలి.
స్టెప్ 4: ఆ తర్వాత చేతులు శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ లేదా హ్యాండ్ క్రీమ్ రాసుకోవాలి.

 

Exit mobile version