వేంకటేశ్వరస్వామి బాలాజీ గా పూజలందుకొంటున్న ఈ ఆలయం చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుచున్నది. ఈ వడ్డీ కాసులవాడు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల వద్ద నుండి వడ్డికాసులు ఏ మాత్రం ఆశించాడు. ఇక్కడ పేద, ధనిక అంటూ ఎలాంటి తారతమ్యాలు ఉండవు. మరి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
స్వామివారి ఆనతి ప్రకారం మాధవరెడ్డి పొదల్లో తవ్విచూడగా అతి సుందర రూపంతో దివ్యకాంతులతో ఉన్న శ్రీవారి విగ్రహం కనిపించింది. ఇలా వెలసిన వెంకటేశ్వరస్వామి వారి మహిమ అంత ఇంత కాదని చెబుతారు.