శివ లింగము హిందూ మతంలో పూజించబడే, శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. మన సాంప్రదాయంలో లింగం శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతుంది.సాధారణంగా శివలింగం సృజనాత్మక శక్తికి సూచికగా ప్రతిష్ఠింపబడి ఉంటుంది. పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు. వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో భృగు మహర్షి శాప ఘట్టంలో భృగుమహర్షి శివుడ్ని “నేటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు,నీ ప్రసాదం నింద్యం అవుతుంది” అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ కచ్చితంగా తేల్చలేదు.
మనం తరచుగా ఇత్తడితో, రాతితో, వజ్రంతో, బంగారంతో, మట్టితో శివలింగాన్ని చేసినట్టు పాదరసంతో కూడా శివలింగాన్ని తయారుచేయచ్చు. ఇది చాలా అరుదైన శివలింగం. దేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఇది కనిపిస్తుంది. పాదరసం అసలు పేరు ‘‘ఏఅసరాజు’’. పూర్వం దేవతల కాలంనుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత వుంది. ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది.
ప్రాచీనకాలంలో ఈ పాదరసంతో తయారుచేయబడిన విగ్రహాలను గృహాల్లో నిర్మించుకుని ఎంతో ఆధ్మాత్మికంగా పూజించుకునేవారు. శివలింగం, లక్ష్మీ, గణేశ, దుర్గ మొదలైన దేవతా మూర్తుల రూపంలో పాదరస విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే.. మంచి సమృద్ధితోపాటు సుఖశాంతులతో కూడిన జీవితాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి. మానవ జీవితంలో భౌతికంగా వున్న లోట్లను తీరుస్తూ, ఆధ్మాత్మికంగా ఉన్నతిని పెంపొందించడంలో ఎంతో సహాయపడుతుంది.
మొత్తానికి పాదరసం పూర్నత్వానికి ప్రతీకగా చెప్పవచ్చు. కేవలం ఆధ్మాత్మికంగానే కాదు. ఆయుర్వేదంలో కూడా దీని ప్రాముఖ్యత గురించి విశ్లేషించబడింది. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం మర్థనానికి దీనిని ఉపయోగిస్తారు. భస్మం రూపంలో మానవునికి ప్రాణదాయకమైన ఎన్నో రసాలుగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా.. తంత్రశాస్త్రంలో కూడా పాదరస మహిమల గురించి వర్ణించబడింది.
ముఖ్యంగా పాదరస శివలింగాన్ని నిత్యం పూజిస్తే.. అన్నిరకాల దోషాలను సంపూర్ణంగా తొలగించవచ్చని మన హిందూ శాస్త్రాలు తెలుపుతున్నాయి. అందులో ఏయే దోషాలకు ఎటువంటి పూజలు చేయాలో కూడా చెప్పబడి వున్నాయి. వాటి గురించి మనం కూడా ఒకసారి తెలుసుకుందాం…
తాంత్రిక పరమైన దోషనివారణ :
మనం అంటే గిట్టనివారు, అసూయపరులు అప్పుడప్పుడు వ్యాపారం మందగించటానికి లేదా కుటుంబసభ్యులకు హాని కలిగించడానికి ప్రయోగాలు వంటివి చేయటం వల్ల ఇంట్లో ఒత్తిడి, గృహక్లేశం, మానసికఅశాంతి వ్యాపిస్తాయి. ఒక్కోసారి మృత్యువు వంటి ఘోరమైన ఆపద కూడా జరగవచ్చు. అలాంటి సందేహం లేదా భయం కలిగితే వెంటనే పాదరస శివలింగాన్ని తీసుకువచ్చి విద్యుక్తంగా పూజించటం ప్రారంభించాలి. ఈ కార్యక్రమం ప్రారంభించిన క్షణం నుండి ఇంట్లో మానసికంగా ధైర్యం, శాంతి ఏర్పడుతుంది. అనాతి కాలంలోనే శత్రు ప్రయోగం విరుగుడు అవుతుంది. పాదరస శివలింగం ఉన్నచోట దుష్ప్రభావాలు పనిచేయవు.
వాస్తుదోష నివారణ :
విద్వాంసుడైన పురోహితుని చేత శుభముహూర్తంలో పాదరస శివలింగం నిర్మింపజేసి, తీసుకునివచ్చి స్థాపించి ఇంటి యజమాని విద్యుక్తంగా ప్రతిరోజూ అభిషేకం, అర్చన చేయాలి. ఇంట్లో ఏ వాస్తుదోషం ఉన్నా తొలిగిపోతుంది.
రోగవిముక్తి :
తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారికి ఔషధసేవనం, చికిత్సతో పాటు పాదరస శివలింగానికి అభిషేకం చేసిన తీర్థం ప్రతిరోజూ ఒక చెంచాడు తాగిస్తే శీఘ్రంగా కోలుకుంటారు.
వివాహ బాధ :
ఇంట్లో ఎవరైనా అవివాహితులు ఉండి వివాహప్రయత్నాలు విఫలం అవుతుంటే పాదరస శివలింగ సాధన చేయించాలి. శ్రద్ధ, విశ్వాసాలతో ప్రార్థించాలి. సాధారణంగా ఈ సాధన ప్రారంభించిన 21 రోజుల్లో వివాహ సంబంధం నిశ్చయం అవుతుంది.
పితృదోషం :
ఏ విధమైన పితృదోషం ఉన్నా పాదరస శివలింగార్చన దాన్ని తొలగిస్తుంది.