దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తీవ్రంగా ఉంది. మరణాల రేటు పెరుగుతూనే ఉంది. దానితో పాటు కరోనా సోకినా వారిలో రికవరీ రేటు కూడా బాగానే ఉందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే కోవిడ్ నుంచి కోలుకుంటున్నామన్న ఆనందాన్ని కూడా దక్కకుండా, తిరిగి వేలాది మంది ఆందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అగ్నికి ఆజ్యంలా మరో ప్రమాదం బ్లాక్ ఫంగస్ రూపంలో కరోనాకు తోడయింది. ముకోర్ మైకోసిస్ అనేది ఫంగస్ వల్ల కలిగే వ్యాధి. ఇది కొత్త వ్యాధి కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నదే. ఇది ఫంగస్ వల్ల కలిగే వ్యాధి. దీన్నే బ్లాక్ ఫంగస్ అంటారు.
మ్యూకార్‌మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్.. మ్యూకార్‌మైకోసిస్ అనే మోల్డ్స్ సమూహం వల్ల వస్తుంది. ఇవి వాతావరణంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఈ బ్లాక్ ఫంగస్ ఆరోగ్య సమస్యలున్న వారికి త్వరగా సోకుతుంది. ఇదివరకే అనారోగ్య సమస్యలున్న కరోనా బాధితులకు స్టిరాయిడ్స్ అతిగా ఇవ్వడం వల్ల ఈ సమస్య ఏర్పడుతున్నట్లు కనుగొన్నారు. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వేసుకునే వారికి ఇది ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. డయాబెటీస్ నియంత్రణలో లేని కరోనా బాధితుల్లో ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. సైనసైటిస్ సమస్య ఉన్నవారికి కూడా బ్లాక్ ఫంగస్ ఏర్పడవచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి ఈ ఫంగస్ ఏర్పడవచ్చు.
వ్యాధి లక్షణాలు :
1. ముఖం లోని కండరాలు తిమ్మిరెక్కడం.
2. కళ్ళు ఎర్రబడడం , ఇంకా కళ్ళు వాపుకి గురికావడం అంటే కను గుడ్డు పెద్దది కావడం.
3. ముక్కులో ఒక్క పక్క మూసికొనిపోయినట్టు ఉండడం.
4. తలనొప్పి, జ్వరం, దగ్గు, రక్తపు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు.
అయితే కోవిడ్ బాధితులందరికీ ఈ ఫంగస్ ఏర్పడదు. అత్యంత బలహీనంగా, ఏమాత్రం ఇమ్యూనిటీ పవర్ లేని వారికి మాత్రమే వస్తుంది. కొద్దిగా ఇమ్యూనిటీ ఉన్నా ఇది మనల్ని ఏమీ చెయ్యలేదు. ఈ ఫంగస్ మన బాడీలోకి వచ్చినా ముందుగా కంటిపై దాడి చెయ్యకుండా కంటిని కాపాడుకునే ఆహారం తినడం ద్వారా దాన్ని అడ్డుకోవచ్చు. కళ్లను కాపాడుకోవచ్చు. ఆ ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చేపలు కంటికి మేలు చేస్తాయి. ముఖ్యంగా సముద్ర చేపలైతే ఇంకా మంచిది. మరి మనకు సముద్ర చేపలు దొరకకపోతే కొవ్వు పట్టి బాగా లావుగా ఉన్న చేపలు కొని వండుకొని తింటే మంచిది. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కంటిని కాపాడుతాయి. కోల్డ్ వాటర్ ఫిష్ మరియు ఆస్ట్రిచెస్ వీటిని కోల్డ్ వాటర్ ఫిష్ అంటారు. వీటిల్లో డిహెచ్ ఎ అనే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన సెల్ డ్యామేజ్ లేకుండా చూసి మాక్యూలర్ డిజనరేషన్ రాకుండా ఆపటం జరుగుతుంది.
అవొకాడోలో ఉన్న లూటిన్, మాస్కులార్ డిజనరేషన్ రాకుండా కాపాడుతుంది. దీనిలో ఉన్న మిగతా పోషక పదార్ధాలు కూడా కంటికి చాలా మంచివి. (బీటాకెరోటిన్, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఇ)
గుడ్లు మనకు దాదాపు అన్ని షాపుల్లో లభిస్తాయి. కంటిని కాపాడే ల్యుటెయిన్ (lutein), జీజాంతిన్ (zeaxanthin) అనే యాంటీఆక్సిడెంట్లు గుడ్లలో ఉంటాయి. రోజూ 3 గుడ్ల దాకా తినవచ్చు. ఫ్రై చేయడం కంటే ఉడకబెట్టి తింటే పోషకాలు బాగా అందుతాయి.
డార్క్ చాక్లెట్స్ లో కోక అధికంగా ఉండటం వల్ల కళ్ళ చుట్టూ ఉండే కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి అన్ స్వీటెడ్ డార్క్ చాక్లెట్ ను రెగ్యులర్ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.
ఆకుకూరలు, పుల్లటి పండ్లు కంటిని కాపాడుతాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటికి, కంట్లోని కణాలకు రక్షణ కల్పిస్తాయి. కంటికి వ్యాధులు రాకుండా చేస్తాయి.
వెల్లుల్లి, ఉల్లిపాయలో అధిక శాతంలో సల్ఫర్ గ్లూటథియొనో ఉత్పత్తి చేసే యాంటిఆక్సిండెంట్స్ కంటి చూపుకు చాలా ఉపయోగకరం.
పప్పులు, బద్దలు గింజలు వంటివి కంటికి మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా తినాలి. వీటిలోని జింక్… కంటిని బాగా కాపాడుతుంది. కంటి చూపును దెబ్బతినకుండా చేస్తుంది.
డార్క్ చాక్లెట్ లాగే రెడ్ వైన్ లో కూడ అధికశాతంలో ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఇవి కార్నియాను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయం చేస్తాయి. క్యారెట్లు సంవత్సరమంతా లభిస్తాయి. వీటిని డైరెక్టుగా కొరికి తినవచ్చు లేదా జ్యూస్ చేసుకొని. పంచదార కలపకుండా తాగడం మేలు. కూర వండుకొని కూడా తినవచ్చు. డైరెక్టుగా తింటే ఎక్కువ పోషకాలు కంటికి అందుతాయి. బీట్ రూట్, క్యారెట్ వంటి వాటిలో కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల కాటరాక్ట్స్ ను తొలగిస్తుంది. అంతే కాదు ఇందులో సాధారణ కంటి చూపును మెరుగుపరిచి, కళ్ళను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడే ఐరెన్ అధికంగా ఉంటుంది.
రెడ్ మీట్ లో అధిక శాతంలో జింక్ మరియు ఎసెన్షియల్ కాంపోనెట్స్ అధికంగా ఉండి, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ మినిరల్స్ ఎంజైమ్ లను అధికంగా ఉత్పత్తి చేయడానికి సహాయపడి, రెటినాను ఆరోగ్యంగా ఉంచుతుంది.
నారింజ, బత్తాయి, కమలా, పప్పర పనస వంటి పండ్లలో సి విటమిన్ ఫుల్లుగా ఉంటుంది. ఇది వ్యాధులు రానివ్వదు. ఫంగస్‌లు, బ్యాక్టీరియాలు దరిచేరకుండా ఆపేస్తుంది. కాబట్టి ఇవి తప్పక తినాలి.
ద్రాక్షలో ఆంథోసైనిన్ అధికంగా ఉండి, రాత్రిల్లో కంటి చూపును స్టాంగ్ గా ఉండేలా చేస్తుంది. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడుల్లా ద్రాక్షపండ్లను తినొచ్చు.
బాదంపప్పులు, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్ వీటిలోఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కంటిని రక్షిస్తాయి. నట్స్, పిస్తాచోస్. వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించి కంటి ఆరోగ్యాన్ని, కార్డియో వాస్కులర్ ఆరోగ్యాన్నీ కాపాడుతాయి. బెర్రీస్ లో ఉన్న ఫ్లెవనాయిడ్స్, నేచురల్ యాంటీయాక్సిండెస్ కళ్ళును సురక్షితంగా ఉంచేందుకు ఉపయోగపడుతాయి.
సబ్జా గింజలను సూపర్ ఫుడ్ అంటారు. వీటిలో కూడా ఒమేగా 3 ఉంటుంది. కాబట్టి… ఓ రూ.10 సబ్జా గింజలు కొని రోజూ కొద్దిగా నానబెట్టి ఓ వారం పాటూ తాగితే మంచిదే. పొద్దు తిరుగుడు పువ్వు గింజలు సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. వీటిలో విటమిన్ E ఉంటుంది. ఇది కంటి చుట్టూ ఉండే చర్మాన్ని కాపాడుతుంది. రోజూ 15 మిల్లీ గ్రాములు వాడినా చాలు కంటికి ఎంతో మేలు.
స్క్వాష్ అనేది పసుపు వర్ణంలో ఉండే వెజిటేబుల్. ఇందులో అధికంగా కెరోటిన్ నిల్వ ఉంటుంది. ఇది మీ దూరంగా చూడటానికి కంటి చూపును మెరుగుపరుస్తుంది.
ఈ ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు చాలా వరకూ తగ్గిపోతాయి. ఒకవేళ సోకినా అది వెంటనే ముదిరిపోకుండా ఇవి బలంగా ఆపుతాయి. ఇవి తీసుకుంటూనే డాక్టర్‌ని కలిసి తగిన ట్రీట్‌మెంట్ తీసుకుంటే ప్రాణాపాయం తప్పడంతో పాటు కళ్ళకు ఎటువంటి హాని కలగకుండా చూసుకోవచ్చు.