Home Health వర్షాకాలంలో సీఫుడ్ తినడం వలన కలిగే నష్టాలు

వర్షాకాలంలో సీఫుడ్ తినడం వలన కలిగే నష్టాలు

0

వర్షాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా భయంకరమైన రోగాల బారిన పడక తప్పదు. సాధారణంగా వర్షాకాలంలో అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ట్రోఎంటెరిటిస్, అల్సర్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు సర్వసాధారణంగా వస్తుంటాయి. వీటితో పాటు ఏది తిన్నా కూడా జీర్ణం కాక ఇబ్బంది పడుతూ వుంటారు.

Dangers Of Eating Seafood During The Rainy Seasonవర్షాకాలంలో కడుపు, పేగు, కాలేయ ఇన్‌ఫెక్షన్‌లతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆహారం, నీటి ద్వారా ఇన్ఫెక్షన్ల కారణంగా రోగాలు అకస్మాత్తుగా దరిచేరే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వర్షాకాలంలో ఎక్కువగా సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం లాంటివి నిర్లక్ష్యం చేయకూడదు.

స్పైసీ, జిడ్డుగల ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. అలాగే ఆహ్లాదకరమైన ప్రదేశాలు తిరగడం వంటివి చేస్తూ పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే బాయిల్ చేసిన నీరు తాగడం అవసరం. వర్షాకాలంలో నీరు కలుషితమై ఉంటుంది. అందువల్ల సీ ఫుడ్ తినడం మానుకోవాలని వైద్యులు చెబుతున్నారు. చేపలు తినడం వల్ల కలరా లేదా డయేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

వాస్తవానికి చేపలు అనేక పోషకాలను అందించే బెస్ట్ ఆహారంగా భావిస్తారు. కానీ వర్షాకాలంలో చేపలు తినడం అంత మంచిది కాదు. ముఖ్యంగా ఈ కాలంలో వర్షం నీటితో కలుషితమైన, సముద్రం నుండి దొరికే చేపలను అసలు తినకూడదు. కలుషితమైన చేతల ద్వారా మన శరీరంలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అసలైన చేపలు వర్షాకాలంలో పుట్టుకొస్తాయి. వాటిలో గుడ్లు కలిగి ఉన్న చేప తిన్నట్లయితే.. కడుపులో అంటువ్యాధులు సంభవించవచ్చు. పైగా వర్షాకాలం కోసం కొన్ని అదనపు స్టాక్లను నిల్వ చేస్తారు. రుతుపవనాల సమయంలో విక్రయించిన చేప తాజాగా ఉండకపోవచ్చు. నీరు అనాహత్య పరిస్ధితుల్లో నిల్వ చేసిన చేపలను తిన్నట్లయితే మరుసటి రోజు వాంతులు కావచ్చు. వర్షాలు వచ్చినప్పుడు మురికి నీటిని ప్రతిచోటా చుట్టుముట్టడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చాలామంది జలాశయాలు వర్షకాల సమయంలో అన్ని రకాలైన విషపూరిత పదార్థాలతో కలుషితం అవుతాయి. అటువంటి నీటి నుంచి వచ్చిన చేపలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు. కొన్ని ప్రదేశాల్లో వర్షపు నీరు చేపలను నిల్వచేయడానికి ఉపయోగిస్తారు.

అందులో బాక్టీరియా మరియు శిలీంధ్రాలు నియంత్రణలో ఉంచుకోగలిగే పాలిఫాస్పేట్లు మరియు సల్ఫేట్లు కూడా ఉంటాయి. కానీ చాలా రసాయనాలు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఇవే కాకుండా రోడ్డు పక్కన ఎటువంటి పండ్లను కానీ కూరగాయలను కానీ కోసినవి తినకూడదు. ఎందుకంటే వీటి పైన రోడ్డు మీద ఉండే బాక్టీరియా ప్రవేశించి, మనకు హాని కలిగిస్తాయి.

ముఖ్యంగా మాన్సూన్ కాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే, నీటిని బాగా మరిగించి, చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టి తాగడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. వర్షాకాలంలో ఫ్రిజ్లో నిల్వ ఉంచిన పదార్థాలను కానీ ,శీతల పానీయాలను కానీ తినకూడదు. పచ్చి ఆకుకూరలను కూడా ఈ వర్షాకాలంలో తినకూడదు. ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరస్ లు ఈ ఆకు కూరల పై ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల మన శరీరానికి కూడా హానికరం.

Exit mobile version