పురాతన కాలం నుండి ఈ ఆలయం ఎంతో మహిమగలదని చెబుతారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ వెలసిన స్వామి వారికి దేవతలు ఆలయాన్ని కట్టించారని ప్రతీతి. మరి దేవతలచే నిర్మించబడిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామి వారు ఎవరు? ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కృష్ణాజిల్లా, కోడూరు మండలం, అవనిగడ్డకు 20 కి.మీ. దూరంలో ఈ హంసలదీవి అనే గ్రామం కలదు. ఈ గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం ఉన్నది. శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన కృష్ణానది ఈ హంసలదీవికి 7 కి.మీ. దూరంలో సాగర సంగమం చేస్తుంది. ఇది దేవతలు నిర్మించిన ప్రాచీన ఆలయంగా భక్తుల నమ్మకం.ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం జరాసంధుడనే రాజు ఒకడు ఉండేవాడు. అతడెన్నో దురాగతాలు చేసి దుష్టుడని పేరుగాంచాడు. ఆ దుష్టత్వంతో అతడు కాకి రూపం ధరించి తిరుగుచు ఒకసారి ఈ ప్రదేశానికి వచ్చి ఇచ్చటగల సాగర సంగమంలో అనుకోకుండా మునిగిలేవగానే, కాకిరూపం పోయి అతనికి హంసరూపం వచ్చినదని ఆ విధంగా అచట వెలసిన గ్రామం హంసలదీవిగా ప్రసిద్ధమైనదని ఈ కథ ఆధారంగా తెలియుచున్నది.ఇక ఆలయ కట్టడం విషయానికి వస్తే, దేవతలకు ఇలాంటి గొప్ప మహత్యం గల ఈ స్తలంలో ఆలయాన్నో నిర్మించవలెనన్న ఒక సంకల్పం కలిగిందట. ఆ సంకల్పంతో వారొక రాత్రివేళ అచటకు అదృశ్యంగా వచ్చి ఆలయమును నిర్మించి, అందులో వేణుగోపాలుని ప్రతిష్టించారు. అయితే ఆ తరువాత ద్వారగోపురమును కట్టడం ఆరంభించారు. ఇంతలో వారికీ కోడికూత వినిపించి తెల్లవారుతుందని, జనం బయటకి వస్తే తాము కనిపిస్తాం అని తలచి గోపురం కట్టడం ఆపేసి బాధతో వెళ్లిపోయారంటా. అందుచేతనే మనకి ఈ ఆలయంలోని గోపురం అసంపూర్ణంగా ఉండిపోయిందని చెబుతారు.ఇక ఈ ఆలయంలో వివాహం చేసుకొని సాగర సంగమ ప్రదేశంలో సరిగంగ స్నానం చేసిన జంటలు నూరేళ్లు సుఖంగా జీవిస్తారనేది భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఈ ఆలయంలో నిద్రచేస్తే సంతాన భాగ్యం లేని వారికీ సంతానం కలుగుతుందని నమ్మకం.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.