Home Health రోగ నిరోధక శక్తిని పెంచే ఈ టీ గురించి తెలుసా ?

రోగ నిరోధక శక్తిని పెంచే ఈ టీ గురించి తెలుసా ?

0

కరోనా లాంటి వైరస్ లు రోజురోజుకూ విస్తరిస్తున్న సమయంలో మనం తీసుకునే ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం జీవన విధానంలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నాం. ఈ కొత్త జీవితానికి తగిన విధంగా కొత్త కొత్త విధానాలు అమలు చేస్తున్నాం.

tea boosts the immune systemబయట తినడం తగ్గించాం. నీరు విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నాం. అలాగే అయితే టీ విషయంలో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బయట టీ తాగడం తగ్గించాం కాబట్టి ఇంట్లో వెరైటీ, ఇమ్యూనిటీ పెంచే టీని తయారు చేద్దాం.

మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనేది ఇమ్యూనిటీ మాత్రమే నిర్ణయిస్తుంది. ప్రతీ ఆనారోగ్యాన్ని, వైరస్ ను తట్టుకునే విధంగా మన రోగనిరోధక శక్తి ఉండాలి. ఇమ్యూనిటీ బాగుంటే ఆరోగ్యం బాగుండటమే కాకుండా.. ఏదైనా ఆనారోగ్యం వస్తే వెంటనే కోలుకోగలుగుతారు.

అందుకే ఈ రోజు ఇమ్యూనిటీని పెంచే స్పెషల్ టీని గురించి తెలుసునే ప్రయత్నం చేద్దాం… ఈ టీ ని పాలతో కాకుండా అల్లం, పసుపు, నిమ్మకాయ రసంతో తయారు చేసుకుంటాము. అదెలాగో చూద్దాం… ముందు వేడి నీటిలో అల్లం ముక్కలు, పసుపును వేయాలి. కాసేపటి తరువాత ఇందులో నిమ్మ రసం, ఒక నిమ్మకాయ ముక్క వేసుకోవాలి. ఇందులో తేనె మిక్స్ చేసి వేడివేడిగా తాగేస్తే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Exit mobile version