Home Health మొక్కజొన్న తింటున్నారా ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

మొక్కజొన్న తింటున్నారా ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

0

కొద్దిగా చినుకు పడితే చాలు వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఆ సమయంలో నిప్పులపై కాల్చిన మొక్కజొన్న కంకులను తింటే ఆ అనుభూతి వర్ణనాతీతం. అంతేనా ధియేటర్‌లో సినిమా చూస్తూ పాప్‌కార్న్‌ తినడంలో ఉండే మజా అలా చేసినవారికే తెలుస్తుంది. దీనిని కాల్చుకుని తిన్నా, ఉడకపెట్టుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. మొక్కజొన్నలో రుచితోపాటు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.

Cornమొక్కజొన్నలో ఉండే ఫెలురిక్‌ యాసిడ్‌ అనే యాంటీ–ఆక్సిడెంట్ అనేక రకాల క్యాన్సర్లను నివారించే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతేకాదు మొక్కజొన్నలో విటమిన్‌ బి–కాంప్లెక్స్‌లోని థయామిన్, నియాసిన్, పాంటోథెనిక్‌ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్, పైరిడాక్సిన్‌ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన శరీరంలో జరిగే జీవక్రియల నిర్వహణకు తోడ్పడతాయి.

వీటితోపాటు ఆరోగ్యానికి అవసరమైన ప్రధాన ఖనిజాలు జింక్, మ్యాంగనీస్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్‌ వంటివి కూడా మొక్కజొన్నలో చాలా ఎక్కువ. ఇందులో ఉండే లినోలె యాసిడ్‌ చర్మమంటలను ర్యాష్‌లను తగ్గిస్తుంది. మొక్కజొన్నలో ఉండే విటమిన్‌ సి, కేరోటియాయిడ్లు, మయో ప్లేవినాయిడ్లు గుండెను చెడు కొలెస్టరాల్‌ నుంచి కాపాడుతాయి. శరీరంలో రక్తప్రసరణ అధికం చేస్తాయి.

అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే మొక్కజొన్న కంకులతో సరైన జాగ్రత్తలు పాటించకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అదేంటంటే మొక్కజొన్న కంకులు తిన్న వెంటనే నీరు తాగకూడదట. మన పూర్వీకులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే దీని వెనుక బలమైన కారణమే ఉంది.

మొక్క జొన్న తిన్న వెంటనే మొక్కజొన్న తింటే జీర్ణ సంబంధమైన ఇబ్బందులు వస్తాయి. మొక్కజొన్నలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వెంటనే నీళ్లు తాగితే ఈ ఫైబర్ పదార్థం జీర్ణం కాదు. అంతేకాదు మొక్కజొన్న కంకులు తిన్న వెంటనే నీళ్లు తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఒక్కోసారి తలనొప్పి, వాంతులు కూడా కావచ్చు. అందుకే మొక్కజొన్న తిన్నాక కనీసం 40 నిమిషాల తర్వాతే నీళ్లు తాగాలి. అప్పటికి కొంత జీర్ణమవుతుంది. కాబట్టి ఆ తర్వాత నీళ్లు తాగితే ఎలాంటి సమస్యలు ఉండవు.

 

Exit mobile version