ఆంజనేయస్వామి అంటే భక్తులందరికీ అత్యంత ప్రేమ. భక్తి, విశ్వాసం. ఆయనను ఆరాధించని హిందువులు ఉండరు. ఆయన నామం స్మరించని వారు ఉండరు. ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా శనివారం, మంగళవారం, గురువారం పూజ చేస్తుంటారు. పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు.
శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. ఏటినాటి శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు. ఏ రకమైన భయం వచ్చినా రోగం, పీడ, ఉపద్రవం వచ్చిన శ్రీఘ్రంగా వరమిచ్చే కలియుగ దైవం హనుమంతుడు.
అలాంటి ఆ స్వామి నిజానికి తొమ్మిది అవతరాలు ఎత్తాడు అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా అది నిజం. వాటిని హనుమన్నవావతారాలంటారు. ఈ విషయం పరాశర సంహితలో పరాశర మహర్షి వివరించడం జరిగింది. ఆ అవతారాల గురించి తెలుసుకుందాం.