Home Health జీడిపప్పు తో పోషక లోపంతో వచ్చే అనేక వ్యాధులను నివారించవచ్చా ?

జీడిపప్పు తో పోషక లోపంతో వచ్చే అనేక వ్యాధులను నివారించవచ్చా ?

0

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మన వంటల్లో రుచికి వాడే పదార్థాల్లోనే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జీడిపప్పు కూడా ఇదే కోవలోకి వస్తుంది. దీన్ని కాజూ అని కూడా అంటారు.జీడిపప్పు అనగానే కొవ్వు పెరుగుతుందనే అపోహ ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. చెడు కొలెస్ట్రాల్‌ను బయటికి పంపి మంచి కొలెస్ట్రాల్‌ను అందిస్తుంది.

Health benefits with cashewsజీడిపప్పులో కాపర్‌, ఫాస్పరస్‌, జింక్‌, ఐరన్‌, మాంగనీస్‌, సెలీనియంతో పాటు అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్స్‌, యాంటీ యాక్సిడెంట్లు లభిస్తాయి. రోజూ మితంగా జీడిపప్పు తింటే పోషక లోపంతో వచ్చే అనేక వ్యాధులను నివారించవచ్చు. అవేంటో పరిశీలిద్దాం.

బరువు నిర్వహణలో సహాయం :

ఒక అధ్యయనం ప్రకారం, అరుదుగా జీడిపప్పు తీసుకునే మహిళలు, వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తీసుకునే మహిళల కంటే ఎక్కువ బరువును కలిగి ఉన్నట్లుగా తేలింది. మీరు ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండాలంటే ఒక క్రమప్రాతి జీడిపప్పును తీసుకోవడం ఉత్తమంగా సహాయపడగలదని మరొక అధ్యయనంలో తేలింది. ఎందుకంటే అవి మీ పొట్టను నిండుగా ఉంచి, శరీరంలో వేడి ఉత్పత్తికి దోహదం చేయగలవని చెప్పబడుతుంది. క్రమంగా జీవక్రియల వేగం పెరుగుతుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది:

జీడిపప్పులో మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు మరియు పాలీశాచ్యురేటెడ్ కొవ్వులు రెండూ ఎక్కువగానే ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను తగ్గించడానికి మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు, కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ జీడిపప్పు కూడా మెగ్నీషియం యొక్క ఘనమైన వనరుగా చెప్పబడుతుంది. ఇది గుండె కండరాలను రిలాక్స్ చేస్తుంది మరియు అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

ఎముకలు మరియు దంతాల ఆరోగ్యవంతమైన అభివృద్ధి కొరకు జీడిపప్పులోని మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం మరియు విటమిన్ కె లు అత్యావశ్యకంగా ఉంటాయి. ఎముకల నిర్మాణంలో మెగ్నీషియం కూడా ప్రధానపాత్రను పోషిస్తుంది, ఎందుకంటే ఇది ఎముకలలోని కాల్షియం శోషణలో సహకరిస్తాయి. క్రమంగా ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి :

జీడిపప్పు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. జీడిపప్పు మొక్క భాగాలలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని, జీడిపప్పు విత్తనాల సారం ఇన్సులిన్ రెసిస్టెన్స్, మరియు గ్లూకోజ్ క్రమబద్దీకరణతో ముడిపడివుందని ఒక అధ్యయనంలో కూడా తేలింది.

క్యాన్సర్ ను నివారిస్తుంది:

జీడిపప్పుతో సహా ఇతర చెట్టు కాయలను తరచూ తీసుకోవడం మూలంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పబడుతుంది. ఎందుకంటే, ఇవి టోకోఫెరాల్స్, అనాసార్డిక్ ఆమ్లాలు, కార్డానోల్స్, కార్డోల్స్ వంటి ఫినోలిక్ సమ్మేళనాల వంటి అనామ్లజనకాలకు మంచి వనరుగా ఉంటాయి, ఇవి జీడిపప్పులో నిల్వ చేయబడతాయి. ఈ అనామ్లజనకాలు ఆక్సిడేటివ్ ఒత్తిడికి కారణమయ్యే ఫ్రీ రాడికల్ నష్టం నుండి శరీర కణాలను రక్షిస్తాయి. ఈ ఆక్సిడేటటివ్ స్ట్రెస్ అనునది, కణ ఉత్పరివర్తనం, DNA నష్టం మరియు క్యాన్సర్ కణితి ఏర్పడటానికి దారితీస్తుంది.

మెదడు పనితీరుకు సహాయపడుతుంది:

జీడిపప్పులోని న్యూరోట్రాన్స్మిటర్లు, సినాప్టిక్ ట్రాన్స్ మిషన్ మరియు మెదడు ద్రవాల (మెంబ్రేన్ ఫ్లూయిడ్స్) ప్రవాహాన్ని క్రమబద్దీకరించడం ద్వారా ఆరోగ్యకరమైన మెదడు పనితీరుకు, మరియు పలు మెదడు ప్రక్రియలకు సహాయపడతాయి. అంతేకాకుండా జీడిపప్పులో ఆరోగ్యకర కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. అధికంగా జీడిపప్పును తీసుకోవడం అనేది మహిళల్లో మరింత మెరుగ్గా పనిచేస్తుంది.

ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది :

జీడిపప్పులో ఎక్కువ స్థాయిలో ఐరన్ ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికి కీలకంగా ఉండడమే కాకుండా, అనీమియా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నరాలు, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే ఐరన్ కూడా అవసరం.

కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది:

జీడిపప్పులో ల్యూటీన్ మరియు జీయాక్సాంథానిన్ అధికంగా ఉంటాయి. ఈ రెండు సమ్మేళనాలు ఫ్రీరాడికల్స్ మూలంగా కళ్ళకు తలెత్తే, సెల్యులర్ డ్యామేజ్ ని నిరోధిస్తుంది. సెల్యులర్ డామేజ్ అనునది మాక్యులర్ డీజనరేషన్ మరియు కంటిశుక్లాల వంటి కంటి వ్యాధులకు దారితీస్తుంది.

 

Exit mobile version