Home Health మన పెరట్లోని తులసి చెట్టు ఇచ్చే ఔషధ గుణాల గురించి తెలుసా ?

మన పెరట్లోని తులసి చెట్టు ఇచ్చే ఔషధ గుణాల గురించి తెలుసా ?

0

మన పూర్వికులు దేనినైన పూజించండి అని చెప్పారంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. హిందువులకు పరమ పూజనీయమైన చెట్టు తులసి. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తులసిని పరమ పవిత్రంగా కొలుస్తుంటారు. తులసి ఇంట్లో ఉంటే పిల్లలకు ఏ గ్రహదోషాలూ అంటవని పూర్వీకుల నమ్మకం. తులసి రెండు రకాలు… ఎర్రపూలు పూసే చెట్టును కృష్ణతులసి అని తెల్లపూలు పూసే చెట్టును లక్ష్మీతులసి అని పిలుస్తుంటారు. అయితే పూజనీయమైనదే కాక తులసిలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయని అంటే ఆశ్చర్యం వేస్తుంది కదూ.. మన పెరట్లోని తులసి చెట్టు ఇచ్చే ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం.

Health Benefits of basilమాములు మొక్కలు పొద్దున సమయంలో కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి అలాగే రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటలు ఆక్సిజెన్ ను వదులుతుంది. తులసి కుండీలలోనైన సులువుగా పెంచగలిగే మొక్క. సర్వ రోగ నివారిణి అని పేరుంది. తులసి ఆకులు సువాసన కలిగి రుచికి చేదుగా, వగరుగా ఉంటాయి. కానీ ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి .

6 లేదా 7 తులసి ఆకులను అల్లం ముక్కతో కలిపి ముద్దగా నూరాలి. ఆ ముద్ద నుండి రసం వడగట్టి అర స్పూన్ తేనెతో కలిపి రోజులో రెండు సార్లు 3- 4 చుక్కలుగా తీసుకుంటే గొంతు గరగరను తగ్గించి మృదువుగా చేస్తుంది, కఫాన్ని వదిలేస్తుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు రెండు చెంచాల తులసి రసాన్ని తీసుకుని తగినంతగ తేనె చేర్చి 2,3 సార్లు తాగితే తగ్గుతుంది.

తులసి ఆకులను పరగడపున కొన్నిరోజుల పాటు 2 – 3 ఆకులను నమిలినట్లైతే ముక్కు దిబ్బడ వంటి శ్వాస లోపాలు సవరించబడతాయి, గుండెకు బలాన్నిస్తుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సుగంధభరితమైన తులసి ఆకు చుట్టూ ఉన్న గాలిని శుద్ధిపరుస్తుంది, క్రిమికీటకాలను, రోగాణువులను అరికడుతుంది. ఇంటిచుట్టూ తులసి మొక్కలు ఉంటే దోమల బాధ ఉండదు. తులసి ఆకు మరియు ఉసిరి కాయల రసాన్ని కలిపి తాగటం వలన పచ్చ కామర్లను నివారించవచ్చు.

తులసి రకాల్లో దేన్నైనా సరే రెండు లేక మూడు ఆకుల్ని నమిలి తింటూ వుంటే బ్రాంకైటిస్ వ్యాధి తగ్గుతుంది. సమస్య వున్నప్పుడు ఈ విధంగా ప్రతి రెండు గంటలకు తింటు వుండాలి. తులసికి కడుపులోని క్రిములను పారద్రోలే శక్తి వుంది. దీనిని వాడటం వలన రక్తహీనత కూడా నివారించబడుతుంది.
నాలుగు తులసి ఆకులకు మిరియాలు రెండు వేసి మెత్తగా నూరి చిన్న మాత్రగా చేసుకొని భోజనానికి అరగంట ముందుగా తింటే బాగా ఆకలి వేస్తుంది. తిన్నది త్వరగా జీర్ణమవుతుంది

Exit mobile version