Home Health బోన్ డెన్సిటీని పెంచే ఆహార పదార్ధాలు ఏంటో తెలుసా ?

బోన్ డెన్సిటీని పెంచే ఆహార పదార్ధాలు ఏంటో తెలుసా ?

0

సాధారణంగా ఎత్తు అనేది వంశపారంపర్యతను బట్టి నిర్ణయింపబడుతుంది. దానితో పాటుగా మనం తినే పోషక ఆహారాలు కూడా ఎత్తు పెరిగేలా చేస్తాయి. ఒక మనిషి 18 ఏళ్ల నుండి 20 ఏళ్ల వరకు ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పటివరకు మన తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు మన ఎత్తు పెరగడానికి దోహదం చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి పోషకాహారం తీసుకోవాలి.

Do You Know Any Foods That Increase Bone Density?ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మరియు ఇతర పోషక పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి. వీటిని తినడం వల్ల బోన్ డెన్సిటీ బాగుంటుందని.. ఎత్తు ఎదుగుతారని చెబుతున్నారు. మరి ఎటువంటి ఆహరం తీసుకోవడం వల్ల బాగా పొడుగ్గా ఎదగచ్చు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఓట్స్ :

పిల్లల నుండి పెద్దల వరకు ఓట్స్ ని ఇష్టంగా తింటారు. ఓట్స్ లో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఓట్స్ మాంగనీస్, భాస్వరం, రాగి, బి విటమిన్లు, ఇనుము, సెలీనియం, మెగ్నీషియం మరియు జింక్ వంటి అనేక విటమిన్లు మరియు ఖనిజాలను అధిక మొత్తంలో అందిస్తాయి. కాబట్టి పిల్లల ఫుడ్ మెనూలో ఓట్స్ ని చేర్చడం మంచిది.

పాలు:

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలల్లో ప్రోటీన్స్, క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉంటాయి. ఎముకల్ని దృఢంగా మార్చడానికి ఉపయోగపడతాయి. పాల ఉత్పత్తులలో ఉండే కాల్షియం మరియు విటమిన్లు కణాల పెరుగుదలకు సహాయపడతాయి. తద్వారా ఎత్తు పెరగడానికి దోహదపడుతుంది.

డ్రై ఫ్రూట్స్ :

పొడి పండ్లు, కాయలు, చాలా విత్తనాలలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, మొక్క ఇనుము మరియు జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మరియు విటమిన్లు బి 1, బి 2, బి 3, విటమిన్ ఇ కలిగి ఉంటాయి. ఇవి ఎముకకు, కండరాల పెరుగుదలకు ఉపయోగపడతాయి.

చేపలు:

చేపలు పిల్లల ఎత్తు పెంచడంలో ఉపయోగపడుతాయి. చేపలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మరియు డి మరియు బి 2 (రిబోఫ్లేవిన్) వంటి విటమిన్లతో నిండి ఉంటాయి. చేపలలో ప్రోటీన్లు, విటమిన్ డి సమృద్ధిగా ఉండి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడుతాయి.

అరటి పండు:

పెరుగుతున్న పిల్లలకి అరటిపండు చాలా ముఖ్యమైనది. దీనిలో పొటాషియం, మాంగనీస్, కాల్షియం, విటమిన్స్ బి 6, సి, ఎ, మరియు ఫైబర్ నిక్షేపాలను కలిగి ఉంటుంది. దీనిలోని ప్రీబయోటిక్స్ గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

చికెన్:

చికెన్ లో కూడా ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది మజిల్స్ ని బాగా తయారు చేస్తుంది. రెగ్యులర్ గా చికెన్ ని తీసుకునే వాళ్ళు బాగా పొడుగు ఎదుగుతారు.

గుడ్లు:

ఫిట్నెస్ కోసం గుడ్లు బాగా సహాయపడతాయి. వీటిల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఎత్తు పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎముకలను కూడా దృడంగా తయారు చేస్తుంది.

సోయాబీన్:

సోయాబీన్స్‌లో ఫోలేట్, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉంటాయి. సోయాబీన్స్‌లో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్, విటమిన్ సి మరియు ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఇవి ఎత్తు పెరుగుదలకు అవసరం. ఇది మాత్రమే కాకుండా ఫోలేట్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవడం వల్ల హైట్ ఎదగచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

 

Exit mobile version