Home Health దానిమ్మ తొక్కతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు

దానిమ్మ తొక్కతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు

0

చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే పండ్లు దానిమ్మ పండ్లు. ఇవి కాలంతో సంబంధం లేకుండా నిత్యం అందుబాటులో ఉండే పండ్లు. ఎర్ర‌గా చూడ‌గానే నోరురూరించే దానిమ్మ పండ్లు కేవ‌లం రుచికి మాత్ర‌మే ప‌రిమితం కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులు అనే తేడాలేకుండా అందరూ నిస్సంకోచంగా దానిమ్మ గింజలు తినొచ్చు. దానిమ్మ గింజలు శరీరానికి మంచి ఔషధంలా పనిచేస్తాయని అందరికీ తెలిసిందే. అయితే గింజ‌ల‌ను తినేసి తొక్క‌ను మాత్రం చెత్త‌లో ప‌డేస్తుంటాం. కానీ దానిమ్మ తొక్క‌లో ఉన్న ఔషధ‌గుణాలు తెలిస్తే ఇక‌పై తొక్క‌ను ప‌డేయ‌డానికి ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఇంత‌కీ దానిమ్మ తొక్క‌తో క‌లిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ తొక్కపండు మీద తొక్కతో పాటు వేరు, బెరడు, ఆకులూ, పువ్వులూ ఇలా అన్నింటిలోనూ ఔషధగుణాలు ఉన్నాయి. దానిమ్మ పండు తొక్క వగరుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ దాన్ని ముక్కులుగా చేసి స‌లాడ్స్ రూపంలో తింటే అంత వగరు అనిపించదు. దీని వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ల‌భిస్తాయి. వాటితో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే గుండె సంబంధ స‌మ‌స్యలు తొలగిపోతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.

దానిమ్మ తొక్క‌ను ఎండబెట్టి పొడి చేసి దాన్ని కాస్త నీటిలో క‌లిపి పేస్ట్‌లా చేసుకొని దాంతో దంతాల‌ను తొముకోవాలి. ఇలా చేస్తే ప‌ళ్లు తెల్లగా, దృఢంగా మారతాయి. అంతేకాకుండా నోటి దుర్వాస‌న కూడా త‌గ్గుతుంది. అలాగే పొడిని నీటిలో కలిపి పుక్కిలిస్తే గొంతు గరగర వంటి సమస్యలు దూరమవుతాయి.

దానిమ్మ తొక్క‌ల‌ను వేడి నీటిలో నాన‌బెట్టి ఆ నీటిని క‌షాయంలా తాగాలి దీంతో కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. అంతేకాకుండా వీటిలో ఉండే ఔష‌ధ గుణాల వ‌ల్ల శ‌రీరంలోని విష ప‌దార్థాలు బ‌య‌ట‌కి వెళ్లిపోతాయి. మహిళలు. పీరియడ్స్ టైమ్‌లో కడుపులో నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి సమయంలో దానిమ్మపండు తొక్కల్ని ఎండబెట్టి చేసిన పొడిని గ్లాస్ వాటర్‌లో ఓ టేబుల్ స్పూన్ వేసి కలిపి తాగించాలి. అది రక్తం పోకుండా ఆపుతుంది.

పైల్స్ సమస్య వేధిస్తున్న వారు ఎండిపోయిన దానిమ్మ తొక్కల్ని పొడి చేసి అందులో బెల్లం కలిపి మళ్లీ గ్రైండ్ చేసి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని రోజూ వాడుతూ ఉంటే పైల్స్ సమస్య మటుమాయం అవుతుంది. అలాగే కడుపులో నొప్పిని కూడా తగ్గిస్తుంది.

దానిమ్మ తొక్క‌ను ఎండబెట్టి, పొడిగా మార్చి.. ఆ పొడిని గోరు వెచ్చ‌ని కొబ్బ‌రి నూనెలో క‌లుపుకొని మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించాలి. అనంత‌రం ఓ 15 నిమిషాల త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి.. ఇలా త‌రుచూ చేస్తుంటే చుండ్రు స‌మ‌స్య తగ్గుతుంది.

దానిమ్మ తొక్క కేవ‌లం ఆరోగ్యానికికే ప‌రిమితం కాకుండా సౌంధ‌ర్య సాధ‌నంగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. కొబ్బరి నూనె, బాదం నూనె వంటి వాటిలో దానిమ్మ తొక్కల పొడిని కలిపి ముఖానికి రాసుకుంటే సన్ క్రీమ్ లోషన్‌లా పనిచేస్తుంది. ఎండ వల్ల చర్మం కమిలిపోకుండా కాపాడుతుంది. దానిమ్మ తొక్క‌ను ఎండబెట్టి అందులో రోజ్ వాటర్ క‌లిపి ముఖానికి ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. చ‌ర్మానికి నిగారింపు వ‌చ్చి ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

దానిమ్మ తొక్కలు అతిసారం సమయంలో రక్తస్రావం ఆపడానికి మరియు జీర్ణక్రియ మెరుగుపరచడానికి,పేగు వాపు తగ్గించడానికి,హెమోర్హోయిడ్స్ యొక్క వాపు,పేగు లైనింగ్ పట్టుకు సహాయపడుతుంది. గొంతులో టాన్సిల్స్ సమస్యలు, గుండె జబ్బులు, శరీరం నుంచి చెడు వాసనలు, దగ్గు, బ్లీడింగ్ వంటి వాటికి దానిమ్మ తొక్కల పొడి బాగా పనిచేస్తుంది.

 

Exit mobile version