Home Health ఆకుకూరలతో హెయిర్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

ఆకుకూరలతో హెయిర్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

0

కొంతమంది జుట్టు పొడిబారిపోయి ఉంటే మరికొందరి జిడ్డుగా ఉంటుంది. అలాంటి వారు ఇంట్లో దొరికే వాటితోనే మళ్లీ అందమైన జుట్టుని తమ సొంతం చేసుకోవచ్చు. ఆకుకూరలు, పండ్లు ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు కూడా దోహదపడతాయి. మరి ఆకుకూరలతో హెయిర్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

గోరింటాకుగోరింటాకు పొడిలో ఒక కప్పు డికాషన్, ఒక స్పూన్ లవంగాల పొడి, ఒక గుడ్డు, కొంచెం పెరుగు, ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానము చేయాలి.జుట్టు ఆరాక నూనె రాసి మసాజ్ చేయాలి.ఈ విధంగా చేయటం వలన జుట్టు రాలటం తగ్గుతుంది.అలాగే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

మజ్జిగలో ఒక కప్పు చింతచిగురు, ఒక కప్పు గోరింటాకుపొడి తీసుకొని దానిలో అరకప్పు శనగపిండిని కలపాలి. దీనిని మాడుకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలను కడిగేయాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్‌లా పనిచేస్తుంది. అంతే కాదు మీ జుట్టు సమస్యలను కూడా తొలగిస్తుంది.

నాలుగు స్ట్రాబెర్రీలను మెత్తగా పేస్టు చేసి అందులో రెండు స్పూన్ల పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి అరగంట ఆరాకా చల్లని నీటితో కడిగెయ్యాలి. ఇలా పదిరోజులకి ఒకసారి ఈ ప్యాక్ వెయ్యటం వల్ల జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది.

మూడు కమలాపండ్ల నుండి తీసిన తొక్కలను(పచ్చివి) మెత్తగా గ్రైండ్ చేసుకొని, దానిలో ఒక స్పూన్ శెనగపిండి, 1/2 స్పూన్ కాఫీపొడి, ఒక కమలాపండు నుండి తీసిన జ్యూస్ ని అన్నిటిని కలిపి మెత్తటి ముద్దగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుత్తుకి రాసుకుని 25 నిమిషాల పాటు ఉంచి తరువాత చల్లని నీటితో జుట్టుని కడగాలి. ఈ విధంగా 15 రోజులకొకసారి మీకు కావలసిన ప్యాక్ ని వేసుకొంటూ ఉంటే జుత్తు అందం రెట్టింపు అవుతుంది.

రెండు కప్పుల అవిసె ఆకులలో ఒక కప్పు గోరింటాకు , అర కప్పు ఉసిరిపొడి వేసి మెత్తని పేస్ట్‌గా తయారుచేయాలి. ముందుగా తలకు నూనె రాసి 5 నిముషాలు మసాజ్ చేసి ఆ తర్వాత మీరు తయారుచేసుకున్న పేస్ట్ తలకు రాసుకుని 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

 

Exit mobile version