Home Health విటమిన్ డి మనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసా ?

విటమిన్ డి మనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసా ?

0

విటమిన్ డి లోపం అనేక శారీరిక మానసిక సమస్యలకు కారణంగా ఉంటుంది. పసిపిల్లల నుండి, పెద్ద వారిదాకా ఈ సమస్య ఎవరినైనా వేధించవచ్చు. దీని కారణంగాచర్మ సంబంధ సమస్యలు, జుట్టు రాలడం వంటివే కాకుండా, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి.

Vitamin Dవిటమిన్ డి మనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం

ఎముకలకు విటమిన్ డి: విటమిన్ డి కాల్షియమ్ మరియు ఫాస్ఫేట్ ల శోషణకు విటమిన్ డి సహాయపడుతుంది తద్వారా ఆరోగ్యకరమైన ఎముకలకు అలాగే ఎముకలను దృఢపరచడంలో సహాయం చేస్తుంది.

పిల్లలకు విటమిన్ డి: దృఢమైన ఎముకల కోసం పిల్లలకి విటమిన్ డి అనుబంధకాలను సూచించడం జరుగుతుంది. రికెట్స్ (rickets) వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శిశువులలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

వృద్దులకు విటమిన్ డి: వృదులలో ఎముకల సాంద్రత వయసు పెరిగేకొద్దీ తగ్గిపోతుంది,అధ్యయనాలలో విటమిన్ డి ను క్రమంగా తీసుకోవడం వలన వృద్దులలో ఎముకల సాంద్రత పెరుగుతుందని తేలింది.

ఫ్రాక్చర్లకు విటమిన్ డి: వయసు పెరిగేకొద్దీ ఎముకల సాంద్రత తగ్గిపోతుంది అది సులభంగా ఎముకలు విరిగిపోవడానికి కారణమవుతుంది, విటమిన్ డి ఎముకలో కాల్షియమ్ శోషణను పెంచడం ద్వారా ఎముకలు సులభంగా విరిగిపోవడాన్ని నివారిస్తుంది.

మహిళలకు విటమిన్ డి: రుతువిరతి (మెనోపాజ్) లక్షణాలను తగ్గిగించడం లో విటమిన్ డి సహాయం చేస్తుందని అనేక పరిశోధనలలో తేలింది.

పంటికి విటమిన్ డి: దంతక్షయం వంటి పంటి సమస్యలను నివారించడంలో విటమిన్ డి ఉపయోగపడుతుంది. అలాగే పళ్ళను దృఢంగా చేస్తుంది.

విటమిన్ డ్ వనరులు:

విటమిన్ D యొక్క అత్యంత సహజమైన మూలం ఎండ లేక సూర్యకాంతి, ముఖ్యంగా UV-B కిరణాలు. ఎండలో తగినంతగా గడిపినప్పుడు మన చర్మ కణాలు సూర్యరశ్మిని లేదా ఎండను “ఫోటోషియలిసిస్” ద్వారా విటమిన్ D గా మారుస్తాయి. ఈ విటమిన్ D తర్వాత శరీర కణాలకు బదిలీ అయి, అటుపై నిల్వ కొరకు కాలేయానికి రవాణా అవుతుంది.

  • గుడ్డు సొనలు.
  • ట్యూనా, హెర్రింగ్ మరియు సాల్మన్ వంటి చేపలు.
  • జున్ను/చీజ్
  • గొడ్డు (మాంసంలో) కాలేయం (బీఫ్ కాలేయం)
  • చేప కాలేయపు నూనె (కాడ్ లివర్ ఆయిల్)
  • గుల్లలు/నత్తగుల్లలు
  • రొయ్య చేపలు/ష్రిమ్ప్
  • పాలు, సోయా పాలు, మరియు వారి సోయా ఉత్పత్తులు
  • తృణధాన్యాలు మరియు వోట్మీల్స్ వంటి కొన్ని ప్యాక్ చేసిన ఆహారాలు
  • విటమిన్ D అనుబంధాహారాలు మరియు మాత్రలు

 

Exit mobile version