Home Unknown facts గుహలో చెక్కబడిన శివుని ఆలయం ఎక్కడ ఉంది ?

గుహలో చెక్కబడిన శివుని ఆలయం ఎక్కడ ఉంది ?

0

మన దేశంలో ఎన్నో గుహాలయాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ మొత్తం 7 గుహలు ఉండగా వాటిలో 5 గుహలు ప్రధానమైన కొండపైన ఉండగా మిగిలిన రెండు గుహలు ఎదురెదురు ఉన్న రెండు కొండలపైన ఉన్నాయి. మరి ఆ గుహలు ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఉన్న శివాలయం గురించి కొన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Elephanta Cavesమహారాష్ట్ర రాష్ట్రం, ముంబై లో ఘరాపురి దీవి ఉంది. ఘరాపురి అంటే గుహల నగరం అని అర్ధం. ఇక్కడే ఎలిఫెంటా గుహలు ఉన్నాయి. ఈ దీవి శైవుల ప్రధాన స్థావరంగా చెబుతారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ఈ గుహలను యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఈ గుహలను రెండు రకాలుగా అంటే హిందూ, బౌద్ధ గుహలుగా చెబుతారు. ఇవి క్రీ.శ. 5 వ శతాబ్దం కాలం నటిగా చెబుతారు. ఇక్కడ ప్రారంభంలో ఏనుగు బొమ్మ ఉండటంతో పోర్చుగ్రీసు వారు వీటిని ఎలిఫెంటా కేప్స్ అని పేరు పెట్టారని చెబుతారు.

ఇక కొండగుహల్ని తొలిచి శివ మందిరాన్ని అద్బుతంగా మలిచారు. దాదాపుగా 60 వేల అడుగుల వెడల్పు ఉన్న కొండల్ని తొలిచి, ఆ తొలగింపులోనే రాతి స్తంభాల్ని నిలిపిన ఘనత అప్పటి శిల్పులది. తొమ్మిది నుండి 13 వ శతాబ్దాల కాలం లోని రాజులూ ఈ గుహలను నిర్మించినట్లు చెబుతారు. రాతితో చెక్కబడిన ఈ మందిర సముదాయం శివుని నివాసం అని ప్రసిద్ధి చెందింది. ఈ గుహ మందిరంలోని శివుడు శివలింగాకారంలో తూర్పు ప్రవేశద్వారం వైపు ప్రతిష్టించబడి ఉన్నది.

ఇక్కడ శివుడి జీవితంలో వివిధ ఘట్టాలను సూచించే 9 ఫలకాలు ఈ ప్రధాన గుహలో ఉన్నాయి. ఈ తొమ్మిది ఫలకాలలో అర్థనారీశ్వర తత్వం స్త్రీ పురుష శరీరాలు సమభాగంగా ఉండటం ఈ స్వామిలో చూడగలం. ఇక్కడ చెక్కబడిన త్రిమూర్తి విగ్రహాం సుమారు 17 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ శివుడూ పంచభూత అవతారంగా ఉంటాడు. అంటే భూమి, అగ్ని, నీరు, గాలి, ఆకాశం, శివుడి ఒక్కొక్క శిరస్సు ఒక్కొక్క రూపంగా చెక్కబడింది.

Exit mobile version