Home Health ముల్తానీ మిట్టీ వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

ముల్తానీ మిట్టీ వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

0

అందం కోసం పరితపించేవారికి ముల్తానీ మిట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చర్మానికి మేలు చేసే ఈ మట్టి లేనిదే బ్యూటీ ప్రొడక్ట్సే లేవు. ఎలాంటి రసాయనాలు లేని ఈ స్వచ్ఛమైన మట్టిలో ఉండే సహజ ఖనిజాలే చర్మానికి రక్షణ కలిగిస్తాయి. కాసుల వర్షం కురిపిస్తున్న ఈ మట్టి ఎక్కడ లభిస్తుందో ముందుగా తెలుసుకుందాం.

Multani Mittyఇలాంటి మట్టి ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో లభిస్తుంది. అయితే, పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో ఉండే మట్టి మాత్రమే మేలైనదని భావిస్తున్నారు. అందుకే, ఎక్కువ మంది ముల్తాన్‌లో లభించే మట్టిని సేకరించేందుకు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. అందుకే ఈ మట్టిని ‘ముల్తానీ మిట్టీ లేదా ముల్తానీ మట్టి’ అని పిలుస్తారు. అయితే, ఈ మట్టి వల్ల చర్మానికి ఎలాంటి సమస్య ఉండదు. బ్రాండెడ్ సంస్థలు విక్రయించే మట్టిని కొనడమే మేలు.

ముల్తానీ మట్టిలో మెగ్నీషియం, క్వార్ట్జ్, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్, డోలమైట్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మట్టి ఎక్కువగా ఫౌడర్ రూపంలోనే లభిస్తుంది. తెలుగు, నీలం, ఆకుపచ్చ, గోదుమ రంగుల్లో ఎక్కువగా లభిస్తుంది. చర్మం, జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ముల్తానీ మట్టి ఒక వరం. మరి, ఈ మట్టి వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో చూసేద్దాం.

చర్మం మీద జిడ్డును తొలగిస్తుంది:

దీనికి సహజంగా పిల్చే గుణం కలిగి ఉంటుంది. ముల్తానీ మట్టిని జిడ్డు చర్మం నుంచి అధిక నూనెను తొలగించడానికి ఉపయోగించవచ్చు. ఇది చర్మ రంద్రాలను క్లాగ్ లేకుండా చేస్తుంది. అలాగే చర్మం యొక్క సహజ pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. దీనిని సాదారణంగా ఇంటిలో ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తారు. జిడ్డు చర్మం కలవారు ఈ ప్యాక్ ను ప్రతి రోజు వేయాలి. ఒక మోస్తరు జిడ్డు చర్మం కలవారు వారంలో రెండు లేదా మూడు సార్లు ఈ ప్యాక్ ను వేయాలి.

మచ్చలను తొలగిస్తుంది:

ముల్తానీ మట్టి గాయాల మచ్చలను తగిస్తుంది. కాలిన గాయాల గుర్తులను కూడా తగ్గిస్తుంది. ముల్టానీ మట్టి,క్యారట్ గుజ్జు,ఆలివ్ ఆయిల్ మూడింటిని సమాన భాగాలుగా తీసుకోని కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చల మీద రాయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి. వారంలో ఒకసారి లేదా రెండు సార్లు చేస్తే మచ్చలు దూరం అవుతాయి.

చర్మ రంగును మెరుగుపరుస్తుంది:

ముల్తానీ మట్టి మీ చర్మం ఛాయను మెరుగుపరచటానికి ఒక అద్భుతమైన ప్రక్షాళన ఏజెంట్ గా పనిచేస్తుంది.

మోటిమలకు చికిత్స:

మీరు మొటిమలతో బాధ పడుతూ ఉంటే, మీ సమస్యను ముల్తానీ మట్టి తప్పనిసరిగా పరిష్కరిస్తుంది. మొటిమలు రావటానికి ప్రధాన కారణాలు అయిన చర్మ రంధ్రాలకు అడ్డుపడే అవరోదాలు మరియు చర్మంపై ఉండే అదనపు నూనెను తొలగించటానికి సహాయపడుతుంది.

చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది:

వయస్సు పెరిగే కొద్ది చర్మం కుంగటం జరుగుతుంది. ముల్టానీ మట్టి మీ చర్మం బిగువుగా ఉండటానికి మరియు చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరచి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

చుండ్రుకు చికిత్స:

చాలా కాలం నుండి చుండ్రు చికిత్సలో ముల్తానీ మట్టిని ఉపయోగిస్తున్నారు. ఇది చుండ్రుకు కారణం అయిన జిడ్డు, గ్రీజు మరియు ధూళిని గ్రహిస్తుంది. అంతేకాక ఇది తలపై చర్మం మీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే తల మీద చర్మం మీద ఫ్లేక్స్ లేకుండా శుభ్రంగా ఉంచుతుంది.

జుట్టు చివర చిట్లుటను తగ్గిస్తుంది:

ముల్తానీ మట్టి షాంపూ కు ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉందనే విషయం బాగా తెలిసిన వాస్తవమే. దీనిని జుట్టు చివర చిట్లుటను తగ్గించటానికి ఒక కండీషనర్ వలె ఉపయోగించవచ్చు.

అలిసిన అవయవాలకు ఉపశమనం:

మీ చేతులు లేదా కాళ్ళు అలసిన మరియు నొప్పిగా ఉన్నప్పుడు, రక్త ప్రసరణ ఉద్దీపన కొరకు ముల్తానీ మట్టి పేస్ట్ ను ఉపయోగించవచ్చు.మీకు తొందరగా అలసట తగ్గిన అనుభూతి కలుగుతుంది. రక్త ప్రసరణ పెరగటం వల్ల గుండె, నరాలు,ధమనులు మరియు శరీరం అంతా ఆరోగ్యాంగా ఉంటుంది.

మృత కణాలను తొలగిస్తుంది:

ముల్తానీ మట్టి మీ చర్మం పొడి ఫ్లేక్స్ మరియు ధూళి ఎక్స్ ఫ్లోట్ కు సహాయపడుతుంది. మీరు చర్మం శుభ్రపరచడానికి సహాయం మరియు మీ చర్మం తేమగా ఉండటానికి ఫేస్ ప్యాక్ ను తయారుచేయవచ్చు. ఇది పొడి చర్మం కలిగిన వారికి అత్యంత సమర్థవంతముగా ఉంటుంది.

 

Exit mobile version