Home Health ఇంగువతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

ఇంగువతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0

ఇంగువ భారతదేశంలో హింగ్ అని పిలువబడుతుంది. ఫెరులా అసుఫోటెడ అనే మూలిక మరియు దాని నుండి సేకరించిన రబ్బరు లాంటి పదార్ధం. ఈ మొక్క ప్రధానంగా మధ్యధరా ప్రాంతాలలో తూర్పు మరియు మధ్య ఆసియాలో కనిపిస్తుంది. ఇతర సుగంధ ద్రవ్యాలు కలిపి వండిన వంటలతో పోలిస్తే ఇంగువ కలిపి వండిన వంట రుచికరంగా ఉంటుంది. వాసనలోనూ తేడా ఉంటుంది. దీనిని పప్పు, చారు, సాంబార్‌, పులిహౌర, శాకాహార వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. తాలింపు, పచ్చళ్లలో కూడా దీనిని వాడతారు. ఒకప్పుడు ఇంగువ లేని వంటకమే ఉండేది కాదు. ఇప్పుడు దీనిని చాలా మంది విస్మరిస్తున్నారు.

health benefits of aniseఇంగువను తింటే చాలా లాభాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అయితే చాలామంది ఇంగువను తినడానికి ఇష్టపడరు. చాలా ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటారు. కానీ ఇంగువ తింటే మన శరీరంలో మనకు తెలియకుండానే ఎన్నో ఉపయోగాలు కలుగుతాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఇంగువను ప్రతిరోజూ తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ పొడిలోని యాంటీ బయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ప్లమేటరీ లక్షణాలు శ్వాస ఇబ్బందులను పూర్తిగా తగ్గిస్తాయట.

అంతేకాదు తలనొప్పి అధికంగా ఉన్నప్పుడు వేడి నీటిలో ఇంగువ పొడి కలుపుకుని తాగితే త్వరగా తగ్గుతుందట. రోజూ భోజనంలో ఇంగువ ఉండేలా చూసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. నరాలను ఉత్తేజపరుస్తుంది.

అలాగే బెల్లంతో ఇంగువను తీసుకుంటే మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుందట. ఇంగువను తప్పకుండా వాడుతూ ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంగువను నీళ్లల్లో కరిగించి ముక్కులో 3 చుక్కలు వేసుకుని నస్యంగా పీలిస్తే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇంగువ బాగా సహాయపడుతుంది.

పుచ్చుపళ్లతో బాధపడుతున్న వారు రాత్రి పడుకునే ముందు కాస్త ఇంగువను ఆ పంటిపై ఉంచితే అందులో ఉన్న క్రిములు మటుమాయమ వుతాయి.

శరీరంలో ఎక్కడైనా ముల్లు గుచ్చుకుని అందులోనే ఉంటే ఆ ప్రాంతంలో ఇంగువ ద్రావకం పోయాలి. కాసేపటి తర్వాత అది దానంతట అదే బయటికి వచ్చేస్తుంది.

 

Exit mobile version