పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం మజ్జిగ (Butter milk). దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు. పెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది. పెరుగుకి బరువునీ, కఫాన్నీ పెంచే గుణాలు ఉంటాయి.
మజ్జిగ మూడు దోషాలనూ తగ్గిస్తుంది. మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది. మజ్జిగను పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. మజ్జిగకు శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది. ఆవు మజ్జిగ మూడు దోషాలను తగ్గిస్తుంది. పథ్యంగా, ఆకలిని పెంచేదిగా, రుచికారకంగా, బుద్ధివర్థకంగా పనిచేస్తుంది. గేదె మజ్జిగ కఫాన్ని పెంచుతుంది. అలాగే వాపును పెంచుతుంది. కాబట్టి పరిమితంగా వాడాలి.
మేక మజ్జిగ తేలికగా ఉంటుంది. మూడు దోషాల మీద పనిచేస్తుంది. మజ్జిగను వాడకూడని సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు జలోదరం (ఎసైటిస్), యకృద్‌వృద్ధి (హెపటోమెగాలి), ఉబ్బసం, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధుల్లో మజ్జిగను వాడటం మంచిది కాదు.
శరీరాన్ని తేమగా ఉంచుతుంది:
మలబద్దకాన్ని తగ్గిస్తుంది మరియు శరీరానికి కావల్సిన తేమను అంధిస్తుంది. మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.పైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. మజ్జిగను ఎక్కువగా వాడేవారిలో పైల్స్ కూడా తయారుకావు.
క్యాల్షియం:
మజ్జిగ డైరీ ప్రొడక్ట్, ఇందులో అధిక శాతంలో క్యాల్షియం ఉంటుంది. క్యాల్షియం ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు శరీరవృద్దికి బాగా సహాయ పడుతుంది. ఎముకలకు కావల్సిన బలాన్ని ఇచ్చి ఎముకుల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి రోజూ ఆహారంతో పాటు మజ్జిగ తీసుకోవడం చాలా ఆరోగ్యకరం.
అసిడిటిని-వాపును తగ్గిస్తుంది:
మీ శరీరంలో లాక్టోజ్ సరైనపాళ్ళలో లేనప్పుడు మజ్జిగ తాగినప్పుడు మీకు కావల్సిన లాక్టోజ్ ను అందిస్తుంది. ఇది కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఎసిడిటి, వాతం, గుండెలో మంటగా ఉండటం వంటి వాటిని తగ్గిస్తుంది. అంతే కాదు తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
శరీరం అనారోగ్యం పాలు కాకుండా కాపాడేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మజ్జిగలో లాక్టోజ్ మరియు కార్బోహైడ్రేట్స్ రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. శరీరానికి కావల్సిన శక్తినిస్తుంది.
అధిక విటమిన్స్ ఉన్న డ్రింక్:
మజ్జిగలో అధిక శాతంలో విటమిన్ సి, ఎ, ఇ, కె మరియు బిలు మరియు థైయమిన్, రెబోఫ్లోవిన్, నయాసిన్, ఇలాంటివి అధికంగా కలిగి ఉంటాయి. ఈ విటమిన్లు అన్నీ మీశరీరానికి కావల్సిన పోషకాల్ని అందించడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుాయి.
మినిరల్స్:
మజ్జిగలో మినిరల్స్ యొక్క ప్రయోజనం కూడా అధికంగా ఉంటుంది. ఇది ఐరన్, భాస్వరం, జింక్, పొటాషయం అధిక శాతంలో కలిగి ఉంటాయి.
కెలోరీలు తక్కువ:
మీరు కనుక డైయట్ పాటిస్తుంటే ప్రతి రోజూ ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే వీటిలో జీర్ణశక్తిని పెంచే విటమిన్స్ ఉండటమే కాక, క్యాలరీలు, ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. వెన్న తీసిన పాలుతో తయారు చేసె పెరుగు లేదా మజ్జిగా డైటేరియన్స్ కు చాలా ఆరోగ్యకరం. ఇది బరువును తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుంది.