Home Health ఐస్ క్యూబ్స్ తో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

ఐస్ క్యూబ్స్ తో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0

వాటర్ తాగేటప్పుడు చాలామందికి అందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవడం అలవాటు. అప్పటికప్పుడు ఏదైనా జ్యూస్ గాని, ఏదైనా ఫుడ్ గాని చల్లగా కావాలనుకుంటే అందులో ఐస్ క్యూబ్స్ వేసి తీసుకుంటారు. అయితే ఈ క్యూబ్ తో చాలా ఉపయోగాలు ఉంటాయి.

ఐస్ క్యూబ్స్చల్లదనం కోసం మాత్రమే కాదు బాడీ పెయిన్స్ వచ్చినా ఐస్ క్యూబ్స్ తో రఫ్ చేస్తే అక్కడ పెయిన్ తగ్గుతుంది, కాళ్లు చేతులు నొప్పులు వచ్చినా అక్కడ ఐస్ క్యూబ్ తో రఫ్ చేస్తూ ఉంటే ఆ పెయిన్ తగ్గి ఉపశమనం లభిస్తుంది.

ఇక ముఖంపై మొటిమలు, ముడతలు వంటివి చాలా మందిని వేధిస్తుంటాయి. అలాంటి సమస్యలు తగ్గాలంటే ఐస్ ముక్కని క్లాత్ లో వేసుకుని సమస్య ఉన్న చోట అద్దండి. ఇలా చేస్తే నొప్పి మొటిమలు తగ్గుముఖం పడతాయి. అయితే ఇక్కడ ఉపయోగించే క్లాత్ క్వాలిటీది అయి ఉండాలి మురికిగా ఉండకూడదు.

ఇక కొంతమందిలో కళ్ళు ఉబ్బిపోయి ఉండడం, కళ్లకింద ముడతలు పడినట్టు ఉండడం కనిపిస్తుంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కళ్ల కింద మచ్చలు ఉన్నా నెమ్మదిగా ఐస్ క్యూబ్ తో అద్దితే ఎంతో మంచిది.

ఇవే కాదు చర్మం పై వాపులు ఉన్నా ఐస్ క్యూబ్స్ రెండు మూడు నిమిషాలు ఉంచుకుంటే అక్కడ ఎలాంటి పెయిన్ ఉన్నా తగ్గుతుంది. అయితే ఐస్ క్యూబ్స్ ని వాటర్ లో వేసుకుని తాగద్దు అంటున్నారు నిపుణులు. దీని వల్ల శరీరానికి వేడి చేస్తుంది. అలాగే ఐస్ వాటర్ కు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యం అనేది గుర్తు ఉంచుకోవాలి.

Exit mobile version