Home Health ధూమపానం వల్ల ఎదుర్కునే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా

ధూమపానం వల్ల ఎదుర్కునే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా

0

ధూమపానం వల్ల కలిగే అనర్ధాల గురించి అనేక కథనాలు ప్రచురితమవుతూనే ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు కూడా పొగ పీల్చడం వల్ల కలిగే నష్టాలను ఏకరువుపెడుతూనే ఉన్నారు. ఐనా మంచి మాటలను చెవులకు ఎక్కించుకునే వారికన్నా పెడచెవిన పెట్టేవారే ఎక్కువ.

health problems caused by smokingధూమపానం తాగేవారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. సిగరెట్‌ తాగేవారికే కాకుండా వారి చుట్టుపక్కల ఉన్నవారి ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇంతకీ ధూమపానం వాళ్ళ ఎదుర్కునే ఆరోగ్య సమస్యలు చూద్దాం.

ఊపిరితిత్తుల క్యాన్సర్ :

స్మోక్ చేసే వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పొగాకు తయారీలో చేర్చే అనేక రకాల రసాయనాలు లంగ్ క్యాన్సర్ కు దారితీస్తాయి. ఈ కెమికల్స్ ఊపిరితిత్తుల్లోని కణాలను నాశనం చేస్తాయి. దాంతో కొత్త కణాల ఏర్పాటు పూర్తిగా క్రుశించి పోతుంది. దాంతో క్యాన్సర్ కు దారితీస్తుంది.

హార్ట్ డిసీజ్ :

రక్తనాళాల్లో నికోటిన్ చేరడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. నికోటిన్ రక్తంను గడ్డకట్టేలా చేస్తుంది. అంతే కాదు ఈ గడ్డ కట్టిన రక్తం రక్తంతో ప్రవహించి గుండెకు సంబంధించిన చిన్న రక్తనాళాలను బ్లాక్ చేస్తాయి. దాంతో హార్ట్ అటాక్ ను ఎదుర్కోవల్సి వస్తుంది. హైబ్లడ్ ప్రెజర్ కు కారణమవుతుంది.

వంధ్యత్వం:

పురుషుల్లో వంద్యత్వానికి కారణం స్మోకింగ్. సిగరెట్స్ లో నికోటిన్ తో పాటు అనేక రసాయనాల కలయిక వల్ల శీఘ్రస్కలన సమస్యలు , లైంగిక సమస్యలు, లైంగికాసక్తి తగ్గడం, వీర్యకణాలు నాణ్యత, వీర్య కణాల సంఖ్య తగ్గడంతో సంతానలోపం జరగుతుంది.

గర్భస్రావం:

మహిళలు స్మోకింగ్ చేస్తే గర్భస్రావం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కాదు, వారి పార్ట్నర్ స్మోకింగ్ చేసినా గర్భస్రావం జరుగుతుంది. స్మోకింగ్ చేసే మగవారిలో వీర్యకణాల నాణ్యత తగ్గతుంది. పిండంలో జన్యుసంబందమైన సమస్యలు వస్తాయి.

ప్రీమెచ్యుర్ ఏజింగ్ :

స్మోకింగ్ కారణంగా క్యాపిల్లరీస్ బ్లాక్ అవ్వడం వల్ల రక్తప్రసరణ చర్మానికి సరిగా జరగకపోవడం వల్ల స్కిన్ ఎలాసిటి, కొల్లాజెన్ డ్యామేజ్ అవుతుంది. దాంతో చర్మంలో ముడతలు, కళ్లవద్ద, పెదాల చుట్టూ ముడుతలు ఎక్కువ అవుతాయి. అంతే కాదు చర్మం నిర్జీవంగా మారుతుంది. స్కిన్ పిగ్మెంటేషన్, ముడుతలు, డార్క్ స్పాట్స్ , డ్రై స్కిన్ కారణంగా, చిన్న వయస్సులోనే వయస్సైన వారిలా కనబడుతారు.

ఓరల్ క్యాన్సర్:

స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే కాదు, నోటి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా స్మోక్ చేయడం వల్ల నోటిలోని చర్మ కణాల మీద తీవ్ర దుష్ప్రభావం కలిగి , శరీరంలోని కణాలల్లో కూడా క్రమంగా మార్పు జరగుతుంది.

స్ట్రోక్ :

సిగరెట్స్ లో ఉండే కెమికల్స్ రక్తంలో చేరడం వల్ల రక్తం గడ్డ కడుతుంది. ఈ గడ్డ కట్టిన రక్తం, రక్తప్రసరణ ద్వారా ప్రయాణించి బ్రెయిన్ కు సంబంధించిన చిన్న రక్తనాల్లోకి చేరి, అక్కడ రక్త ప్రసరణ తగ్గడం వల్ల మెదడ పనితీరు మందగిస్తుంది, ఫలితంగా స్ట్రోక్ కు గురిచేస్తుంది.

మాస్క్యులర్ డీజనరేషన్ :

లంగ్స్, లివర్ మాత్రమే కాదు కంటిలోని నరాల వ్యవస్థను కూడా డ్యామేజ్ చేస్తుంది స్మోకింగ్. స్మోకింగ్ వల్ల కళ్లకు కూడా హాని కలుగుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. స్మోకింగ్ వల్ల కళ్లు పొడిబారడం, గ్లూకోమా వంటి సమస్యలు ఎదురవుతాయి.ఆప్టిక్ నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల శాశ్వతంగా కంటి చూపును కోల్పోతారు.

 

Exit mobile version