Home Health వేడి వేడి టీ తాగితే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా ?

వేడి వేడి టీ తాగితే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా ?

0

తలనొప్పిగా ఉన్నా లేదా ఒత్తిడి, విసుగు వచ్చినా వెంటనే ఓ కప్ టీ తాగాల్సిందే, లేకపోతే మైండ్ పనిచేయదు అంటారు చాలా మంది. అంతేకాదు ఇలా టీ తాగకపోతే ఆ పని ముందుకు సాగదు. కొంతమంది అయితే పొగలు కక్కేలా ఉన్న టీ తాగుతారు.. నాలుక సుర్రమని కాలినా దానిని అలాగే ఆస్వాదిస్తారు.

Hot Teaఅయితే ఇలా వేడి వేడి టీ తాగితే కడుపులో కొన్ని సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు. వేడి ఎక్కువైతే అన్నవాహికకి కాన్సర్ వచ్చే ప్రమాదముందంటున్నారు. 75 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువ వేడితో టీ తాగితే, క్యాన్సర్ వస్తుందట.

అంతేకాదు అల్సర్ సమస్య ఉంటే అది మరింత పెరిగే ప్రమాదం ఉందట. గ్యాస్ ట్రబుల్ ఉన్న వారిపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు చెమటలు పట్టడానికి ఇది ప్రధాన కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు. ఒకవేళ టీ తీసుకుంటే మినిమం 3 నిమిషాలు ఆగాలి. కాస్త చల్లారిన తర్వాత అంటే గోరు వెచ్చగా తాగినా పర్వాలేదు కాని పొగలు కక్కేలా మాత్రం తాగొద్దట.

అయితే వేడి మాములుగా ఉన్నా రాత్రి నుండి ఖాళీగా ఉన్న కడుపులో.. ఉదయాన్నే టీ పోయడం వల్ల ఆరోగ్యానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల టీ తాగడం వల్ల శరీరానికి ఏ సమస్యా లేకపోయినా… ఉదయాన్నే తాగడం వల్ల మాత్రం ఇబ్బందులున్నాయట.

అధిక మోతాదులో టీ తాగితే…నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. టీ లోని థీయోఫైలిన్ అనే రసాయనం డీహైడ్రేషన్ కు కారణం అవుతుంది. ఇది మలబద్దకానికి దారి తీస్తుంది. ఉదయాన్నే టీ త్రాగడం వలన విరేచనం సాఫీ గా అవుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ అధిక మోతాదులో టీ త్రాగితే మలబద్దకం వస్తుంది.

కెఫీన్ మూడును మర్చేస్తుందనే సంగతి తెలిసిందే కదా కానీ కెఫీన్ మోతాదు పెరిగితే నిద్ర పట్టక పోవడం, విశ్రాంతి లేకపోవడం, హృదయ స్పందనల రేటు పెరగడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక గర్బం దాల్చిన వారు టీ మనేయ్యడమే ఉత్తమం. పిండం ఎదుగుదలకు కెఫీన్ హనీ కలిగించే అవకాశం వుంది. అదే జరిగితే అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది.

Exit mobile version