Home Health వేపాకులో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

వేపాకులో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0

యుగ యుగాల నుండి మన దేశంలో గృహ వైద్యం లోను, ఇతర విధాలుగానూ వేప ఉపయోగపడుతుంది. వేప చెట్టు లో బెరడు, ఆకులు, పువ్వులు, గింజలు, కలప, నూనె, పిట్టు….. సమస్తం మన ఆరోగ్యం పెంచడానికి ఉపయోగపడుతుంది. అందుకే అన్నారు వేపతో వేయి లాభాలు అని.

Health Benefits of Vepaakuఅనేక రకాల చర్మ వ్యాధులు, చిరకాలంగా తగ్గని పుళ్లు, మధుమేహం, రక్త దోషాలు, శరీర దుర్గంధం, ప్రేగుల్లో క్రిములు, మొటిమలు మొదలైన రోగాలను నయం చేయడానికి వేప అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వేపాకులో దాగి ఉన్నాయి కాబట్టే కొన్ని వేల సంవత్సరాల నుంచి దీనిని వివిధ ఔషధాల్లో వినియోగిస్తున్నారు.

అలాగే.. వేపగింజల్లో కూడా అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ దాగివున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ గింజలు అన్నిరకాల జీర్ణ, చర్మ, ఆరోగ్య సమస్యల్ని నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు. ఈ గింజల్ని అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో తీసుకుంటే.. జీవనశైలి మరింత ఉత్తమంగా కొనసాగుతుంది. మరి ఈ వేపగింజల వలన కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా.

->కళ్ళు, చెవులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో వేపగింజలు చక్కగా సహాయపడుతాయి. వేపగింజలతో తయారుచేసిన వేపనూనెను వాడడం వలన ఇన్ఫెక్షన్స్ నుండి సత్వర ఉపశమనం వుంటుంది.

->తరచూ అనారోగ్యానికి గురిఅయ్యే వారు ఈ వేపగింజల్ని పాలలో కలిపి తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. అవి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

->మలేరియాను నివారించడండలోనూ ఈ గింజలు బాగా పనిచేస్తాయి. దోమలు ఉన్న ప్రదేశంలో వేప గింజలను చల్లితే.. దోమగుడ్లు నాశనం అవుతాయి.

->ఇక మహిళలకు ఈ వేపగింజలు నేచురల్ బర్త్ కంట్రోల్ గా పనిచేస్తాయి. ఇది ‘లూబ్రికేంట్’లా పనిచేసి గర్బధారణను నివారిస్తుంది. దాంతో అవాంఛిత గర్భంను నివారించుకోవచ్చు.

->వేపగింజలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది. ముఖ్యంగా మొటిమలు, ముఖంలో బాయిల్స్, అల్సర్ వంటి వాటిని ఎఫెక్టివ్ గా ఎదుర్కొంటుంది.

->చికెన్ పాక్స్, అమ్మవారు, తట్టు తదితర వ్యాధుల వల్ల కోల్పోయిన ఎనర్జీని అందివ్వడంలో, వ్యాధినిరోధకశక్తిని పెంపొందించడంలో ఈ గింజలు అద్భుతంగా సహాయపడుతాయి.

 

Exit mobile version