Home Health బ్రెయిన్ ట్యూమర్ రావడానికి గల కారణాలు ఏంటో తెలుసా ?

బ్రెయిన్ ట్యూమర్ రావడానికి గల కారణాలు ఏంటో తెలుసా ?

0

మెదడులో క్రమంగా పాతకణజలాలు పోయి కొత్త కణజాల సృష్టి నిరంతరంగా జరుగుతున్నప్పుడు పాత కణజాలు సమసిపోకుండా మిగిలిపోయినప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిని తెలుగులో ‘మెదడు కణిత’ అని అంటారు. ఈ వ్యాధి సంక్రమించడం వల్ల ఏ భాగానికైన దేబ్బతగిలితే అక్కడ పనితీరు మందగిస్తుంది.

brain tumorమెదడు కణితులు మెదడుకు మాత్రమే పరిమితం అవుతాయని చాలా మంది నమ్ముతారు, కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఈ కణితి క్యాన్సర్‌గా మారితే, అది మూత్రపిండాలు, పేగులు ఊపిరితిత్తులకు కూడా చేరుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. మెదడు కణితిలో, లక్షణాలు రోగులలో భిన్నంగా కనిపిస్తాయి.

బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి రెండు రకాలు. మెదడులో స్వతహాగా ఏర్పడే కణితిని ప్రైమరీ ట్యూమర్ అంటారు. శరీరంలోని ఛాతీ, పొట్ట,లివర్, లంగ్‌ల సమస్యల ద్వారా మెదడులో ఏర్పడే కణితిని సెకండరీ ట్యూమర్ అంటారు. ధూమపానం వల్ల ఊపరితిత్తుల నుంచి మెదడులో కణితి ఏర్పడవచ్చు. అలాగే అధికంగా మద్యం తాగటం వల్ల లివర్ ద్వారా మెదడులో కణితి ఏర్పడే అవకాశాలున్నాయి.

మెదడు కణితి ప్రారంభ లక్షణాలను అర్థం చేసుకుంటే, ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఉన్న‌ట్టు ఉండి జ్ఞాపక శక్తి లోపించ‌డం లేదా ఉన్న‌ట్టుండి ఆలోచించే విధానంలో మార్పులు రావ‌డం బ్రెయిన్ ట్యూమ‌ర్ ల‌క్ష‌ణంగా చెప్పుకోవ‌చ్చు. ట్యూమ‌ర్ ఉన్న వ్య‌క్తులు జ్ఞాప‌క శ‌క్తిని సెడ‌న్‌గా కోల్పోతారు. ఎప్పుడూ గంద‌రగోళంగా క‌నిపిస్తుంటారు.

అలాగే ట్యూమ‌ర్ ఉన్న వారిలో కంటి చూపు మంద‌గించ‌డం, మ‌స‌క‌బార‌డం వంటి ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. ఫిట్స్ కూడా బ్రెయిన్ ట్యూమ‌ర్ ల‌క్ష‌ణంగా చెప్పుకోవ‌చ్చు. అందులోనూ పద్దెనిమిదేళ్ల వయస్సు దాటిన వారిలో వచ్చే ఫిట్స్ ఎక్కువ‌గా కణతులకు సంబంధించినవే ఉంటాయి. అందువ‌ల్ల‌, త‌ర‌చూ ఫిట్స్‌కు గురైతే ఖ‌చ్చితంగా వైద్య‌ల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

అలాగే శరీర భాగాల్లో కొన్ని చోట్ల చచ్చుబడిపోవడం, నిటారుగా నిలబడలేకపోవడం, వ‌ణుకు వంటివి ట్యూమ‌ర్ ల‌క్ష‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు.అంతేకాదు భ‌రించ‌లేనంత‌ త‌ల‌నొప్పి, త‌ర‌చూ తీవ్ర‌మైన ఒత్తిడికి గురికావ‌డం, వాంతులు, వికారం, మాట్లాడడానికి మింగడానికి కష్టంగా ఉండ‌టం, ఎప్పుడూ మ‌గ‌త ఉండ‌టం ఇవ‌న్నీ కూడా ట్యూమ‌ర్ ల‌క్ష‌ణాలే.

ఒక వేళ ఎవరైనా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ ఉంటే దానిని లైట్ తీసుకోకుండా డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం మంచిది. సీటీ స్కాన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక కేవలం రెండు సెకండ్లలోనే మెదడులో ఏర్పడిన కణితిని సులభంగా గుర్తిస్తున్నారు.

Exit mobile version