Home Health కలబందతో కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసా ?

కలబందతో కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసా ?

0
కలబంద అనగానే ఆయుర్వేదంలో కీలకమని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధమని అందరూ అనుకుంటారు. నిజమే చర్మం కాలిన గాయాలకు చికిత్స చేయడం నుండి చర్మాన్ని తేమగా మార్చడం మరియు మంటను ఆపడం వరకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలకు గాని మలబద్దకానికి కానీ ఇది మంచి ఔషధంగా చెప్పవచ్చు.
side effects of aloe vera
ఈ రోజుల్లో వాడే ప్రతి ఆరోగ్యకర ఉత్పత్తులు తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ ప్రొడక్ట్స్ కలబంద లేకుండా ఉండడం లేదు. తలకు రాసుకునే నూనె, సోప్, ఫేస్ వాష్ ఇలా అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. అలాగే ఇవి మామూలు వాటికన్నా అద్భుతంగా పని చేస్తాయి. ఎందుకంటే కలబందలో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ సోడియం పామాల్, సోడియం కార్బోనేట్ లాంటి ప్రత్యేకమైన ఔషధాలు ఉన్నాయి.
అయితే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే కలబంద వలన కొన్ని అవాంఛిత దుష్ప్రభావాలు కూడా ఎదురవుతాయని చాలామందికి తెలియదు. ఆప్తమిత్రుడిలా అంత మంచి చేసే కలబంద వలన మనకు నష్టం కూడా కలుగుతుందా అని ఆశ్చర్యం కలగొచ్చు. కానీ సరైన సమయంలో సరైన మోతాదులో తీసుకోకపోతే మనం తినే ఆహారమైన విషంగా మారి అనారోగ్యానికి దారి తీస్తుంది.
కలబంద కూడా అంతే. మరి కలబందను ఎలా తీసుకోవడం వలన సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం… తరుచుగా కలబందను తీసుకోవడం వలన శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గడానికి కారణం కావచ్చు. ఇది మూర్ఛలు మరియు ఎలక్ట్రోలైట్ అసాధారణతలకు దారితీస్తుంది. కీమోథెరపీ సమయంలో ఈ ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయి.
అందరికీ కలబంద పడకపోవచ్చు. కలబందను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమంది వ్యక్తులలో కడుపు నొప్పి, వికారం, వాంతులు, మరియు దద్దుర్లు వస్తాయి. ఒకవేళ మీరు కూడా కలబంద వాడుతున్నట్లైతే ఈ లక్షణాలలో దేనినైనా మీరు గమనించినట్లయితే, ఇకనుండైనా కలబందను వాడకపోవడం మంచిది.
డీకోలోరైజ్డ్ కలబంద గుజ్జును తీసుకోవడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అధ్యయనాలు ఎలుకలపై నిర్వహించినప్పటికీ, ఫలితాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. అందువల్ల, క్యాన్సర్ చికిత్సకు అనుబంధంగా కలబందకి సంబంధించి గుజ్జు కానీ, జ్యుస్ కానీ ఉపయోగించే ముందు దయచేసి వైద్యులని సంప్రదించండి.
గర్భధారణ సమయంలో కలబందను తీసుకోవడం బిడ్డపై విష ప్రభావాలను కలిగిస్తుంది. కాబట్టి ఆ సమయాల్లో వీలైనంత వరకు కలబందను దూరంగా పెట్టడమే మంచిది. కలబంద ఎక్కువగా వాడకం వల్ల కాలేయానికి హాని కూడా కలుగవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఒకవేళ మీకు కాలేయ సమస్యలు ఉంటే, దయచేసి వైద్యులని సంప్రదించి తీసుకోవడం మంచిది.

Exit mobile version