చూయింగ్ గమ్ నమలడం ఈ జనరేషన్ కి ఫ్యాషన్ అయిపోయింది. టైమ్ పాస్ కోసం కొందరు, ముఖానికి వ్యాయామం అవుతుందని కొందరు, అలవాటు ప్రకారం ఇంకొందరు తరచూ చూయింగ్ గమ్‌లను నములుతుంటారు. చూయింగ్ గమ్‌లు నమలడం వల్ల ముఖానికి వ్యాయామం సంగతి ఏమో కానీ ఆరోగ్యానికి మాత్రం తీవ్రమైన దుష్పరిణామాలను కలిగిస్తుందట.
చూయింగ్ గమ్‌ల వల్ల మన పేగుల్లో సమస్యలు వస్తాయని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలే చూయింగ్ గమ్‌లను నమిలే కొందరిపై పరిశోధనలు చేశారు సైంటిస్ట్ లు. చూయింగ్ గమ్‌లలో ఉండే టైటానియం డయాక్సైడ్ అనబడే ఓ రసాయనిక సమ్మేళనం మన పేగులకు సమస్యలను తెచ్చి పెడుతుందని ఆ సైంటిస్టులు రుజువు చేసారు.
ఆ రసాయనం వల్ల పేగులు మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను సరిగ్గా గ్రహించలేవని నిర్దారించారు. అంతేకాదు చూయింగ్ గమ్‌లను ఎక్కువగా నమిలే వారిలో పోషకాహార సమస్యలు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.
వాటిలో ఉండే టైటానియం డయాక్సైడ్ వల్ల పేగులు మనం తినే ఆహారంలో ఉండే ఐరన్, జింక్, ఫ్యాటీ యాసిడ్లు తదితర పోషకాలను గ్రహించలేవని చెబుతున్నారు. కాబట్టి చూయింగ్ గమ్‌లను ఎక్కువగా తినేవారు వాటికి దూరంగా ఉంటే మంచిదని సైంటిస్టులు సలహా ఇస్తున్నారు. ముఖానికి వ్యాయామం అనుకునేవారు దానికోసం ఇతర ఎక్సర్సైజ్ లు ప్రయత్నిచడం మంచిది. ముఖ్యం మొత్తం కదిలేలా ఎప్పుడు నవ్వుతూ ఉంటే ముఖానికి మంచి వ్యాయామం అవుతుంది.