సాధారణంగా తల్లి కడుపులో బిడ్డ తొమ్మిది నెలలు ఉంటుంది అని మనకు తెలుసు. ఆ తొమ్మిది నెలలు కడుపులోనే ఆక్సిజన్, అక్కడే నిద్ర. తల్లి తీసుకునే ఆహరం తోనే ఎదుగుతూ… 9నెలలు గర్భంలో భద్రంగా ఉంటుంది. అంతేకాదు ఆ సమయంలో బిడ్డ నుంచి కొన్ని స్పందనలు, ప్రతిస్పందనలు ఉంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తాయి, మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. మరి ఆ వింతలేంటో ఒక్కసారి చూద్దాం.
ప్రెగ్నన్సీలో మూడు నెలలు దాటాక లోపల ఉన్న బిడ్డ కలలు కూడా కంటుందని మీకు తెలుసా? వినడానికి వింతగా అనిపించవచ్చు కాని ఇదే నిజం. తల్లి కడుపులో కలలు కనే ఎబిలిటి పిల్లలకి ఉంటుంది. కాని ఈ ప్రపంచాన్ని చూడని పిల్లలు ఏం కలలు కంటారు అనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలకి అంతుచిక్కట్లేదు.