Home Unknown facts గణపతి ఆకృతి దేనిని సూచిస్తుందో తెలుసా?

గణపతి ఆకృతి దేనిని సూచిస్తుందో తెలుసా?

0
ఏ పూజ చేసిన మొదట వినాయకుడికి పూజ చేసిన తరవాతే ఏ పూజ అయిన చేస్తూ ఉంటాం. వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన శరీరంలో ఒక్కో భాగం దేనిని సూచిస్తుందో చాలా మందికి తెలియదు అవేంటో తెలుసుకుందాం…
గజాసురుడిని చంపిన అనంతరం…శివుడు కైలాసం వస్తుంటాడు. అదే సమయంలో పార్వతి స్నానం చేయడానిక వెళుతుంటుంది. నలుగు పిండితో స్నానం చేయబోతూ..అదే పిండితో…ఓ బొమ్మను చేసి..ప్రాణం పోయడంతో చిన్న బాలుడిగా మారుతాడు. ఎవరినీ లోపలకు రానివ్వద్దని..చిన్న బాలుడికి చెబుతుంది. కాసేపట్లో..అక్కడకు శివుడు వస్తాడు.
లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. బాలుడు అడ్డుకుంటాడు. శివుడికి తీవ్ర ఆగ్రహం వస్తుంది. త్రిశూలంతో బాలుడి తలను వధిస్తాడు. బయటకు వచ్చిన పార్వతి…ఇది చూసి రోదిస్తుంది. ఎలాగైనా బతికించాలని కోరుతుంది. రోదిస్తున్న పార్వతిని చూసి చలించిన శివుడు..ఏనుగు ముఖాన్ని తెమ్మని చెబుతాడు. భటులు తిరిగి తిరిగి..ఓ అడవిలో పడి ఉన్న ఏనుగు ముఖాన్ని తీసుకొస్తారు. ఇదే ముఖాన్ని బాలుడికి అతికిస్తాడు శివుడు.
  • గణేషుడి తల : తెలివికి, బుద్ధికి సింబల్ అంటారు. తెలివితేటలను చూపిస్తుంది. వినాయకుడిలాగా పెద్ద తలకాయ ఉన్న వారిలో తెలివితేటలు ఉంటాయంటుంటారు. ఏనుగు తలను అర్థం చేసుకుంటే…గణపతిలోని లక్షణాలు అర్థమౌతాయి. శరీరంతో పాటు బుద్ధికి సమప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుంది.
  • చెవులు : పెద్దవిగా ఉంటాయి. ప్రతి మాటను శ్రద్ధగా ఆలకించాలని సూచిస్తుంటాయి. అవతలి వ్యక్తి పూర్తిగా మాట్లాడిన తర్వాతే..ఓ నిర్ణయానికి రావాలని చెబుతుంటాయి. ఎక్కువగా విని…తక్కువగా మాట్లాడాలనే సూత్రం చెబుతుంది.
  • తొండం : ఓం గుర్తును చూపించేలా ఉంటుంది. తొండం ఎడమవైపున తిరిగి ఉంటే..ఆయన్ను వామముఖ గణేషుడు అంటారు. సహనం, ప్రశాతంత, ఓర్పును అందిస్తాయి.  తొండం కుడివైపున ఉంటే..ఆయన్ను దక్షిణాభిముఖ గణపతిగా పిలుస్తారు. మోక్షాన్ని, బుద్ధిని అందిస్తుందని అంటారు.
  • చేతులు : హిందూతత్వానికి ప్రతీక భావిస్తారు. ఒక చేతిలో పద్మం (సత్యం, జ్ఞానం, సౌందర్యం) రెండో చేతిలో గొడ్డలి (నమ్మకాలు బంధాలకు అతీతుడు), మూడో చేతిలో స్వీటు, లడ్డూ (జ్ఞానంతో వచ్చే సంతోషం) సూచిస్తుంది. నాలుగో చేయి అభయ ముద్ర (వరాన్ని ఇవ్వడం, ఆందోళన చెందవద్దని, తాను ఉన్నానని) అర్థం వస్తుంది.
  • దంతాలు : రెండు దంతాలు జ్ఞానం, భావోద్వేగాలను సూచిస్తాయి. కుడి దంతం జ్ఞానాన్ని, ఎడమ దంతం భావోద్వేగాన్ని సూచిస్తాయి.
  • పెద్ద బొజ్జ : పండిన వడ్లను పోసేందుకు ఉపయోగంచే గాదెకు గుర్తు అంటుంటారు.
  • ఎలుక వాహనం : ఎలుకను వాహనంగా ఉపయోగిస్తాడు వినాయకుడు. పంటలను పాడు చేసే వాటిని అణిచివేయడం సూచిస్తుంది.

Exit mobile version