Home Health రక్తదానం వల్ల దాతలకు ఎన్ని లాభాలో చూడండి!

రక్తదానం వల్ల దాతలకు ఎన్ని లాభాలో చూడండి!

0
blood
మనం రోజూ వెళ్లే దారిలో ఎన్నిసార్లు రక్తదాన శిబిరాలు చూసి ఉంటాం. కానీ మన పనిలో పడి చూసి చూసినట్టు వెళ్ళిపోతాం. కానీ మన చుట్టూ ఉన్నవాళ్లలోనే ఎంతో మందికి రక్తం అవసరం అవుతూంటుంది. ఆక్సిడెంట్స్ అయినప్పుడో, ఆపరేషన్లు అయినప్పుడో చాలా రక్తం పోతుంది. ఆ సమయంలో రక్తం సరిపోక, అందుబాటులో వారి గ్రూప్ రక్తం లేక ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
  • చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ మనిషిని బతికిస్తుంది రక్తం. అందుకే రక్తదానం గురించి అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే కొంతమంది రక్తం ఇవ్వాలని ఉన్నా తమకేదో అయిపోతుందనే భయంతో రక్తదానానికి వెనుకాడుతుంటారు. కానీ రక్తదానం వలన రక్తం అవసరమైనవారికే కాదు దానిని దానం చేసే దాతలకూ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
  • రక్తదానం చేసేవారికి తమ శరీరానికి సంబంధించిన అనేక రకాలైన రక్త పరీక్షలను పూర్తిగా, ఉచితంగా చేసుకునే అవకాశం దొరుకుతుంది. దీనివల్ల రక్తదానం చేసేవారు తమకు తాము ఆరోగ్యవంతులుగా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకునే సదుపాయం ఉంది. రక్తదాతలకు సాటి మనుషుల ప్రాణాలు కాపాడే అవకాశం లభిస్తుంది. ఇది సాటిలేని సంతృప్తిని ఇస్తుంది.
  • రక్తదానం చేసేవారిలో గుండెకు సంబంధించిన రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. తరచూ రక్తదానం చేయడం వల్ల శరీరంలో ఉత్పత్తయ్యే ఐరన్ శాతం పూర్తి నియంత్రణలో ఉండటమే దీనికి కారణం. రక్తదానం క్యాన్సర్‌ బారిన పడే అవకాశాల్ని దాదాపుగా తగ్గిస్తుంది.
  • రక్త దానం చేయడం వల్ల పెద్ద వాళ్ళు బరువు తగ్గి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రీసెర్చ్ ప్రకారం 450 మిల్లీ లీటర్ల రక్తాన్ని దానం చేయడం వల్ల ఒంట్లో 650 క్యాలరీలు కరుగుతాయి. అయితే కేవలం బరువు తగ్గడానికి ఇది ప్రోత్సాహకరం కాదు. రక్త దానం చేసేటప్పుడు ముందు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు కలుగుతాయా లేదా అనేది చెబుతారు.
  • రక్తదానం చేస్తే హెమోక్రామటోసిస్ సమస్య రాకుండా చూస్తుంది. దీని యొక్క రిస్క్‌ని కూడా ఇది తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా రక్తదానం చేయడం వల్ల ఐరన్ శాతం తగ్గుతూ ఉంటుంది. దీని కారణంగా ఎవరైతే ఈ సమస్య తో బాధ పెడతారో వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. తద్వారా హెమోక్రామటోసిస్ సమస్య కూడా తగ్గుతూ ఉంటుంది.
  • కార్డియో వాస్కులర్‌ వ్యాధులను నివారించేందుకు రక్తదానం ఉపకరిస్తుంది. మహిళల్లో వయస్సు పెరిగిన తర్వాత రుతుస్రావం పూర్తిగా నిలిచిపోయినప్పుడు (మెనోపాజ్‌ సమయంలో) వారి శరీరంలో నిల్వ ఉండే ఐరన్‌ స్థాయిని సమతుల్యం చేసుకోవడానికి రక్తదానం చేయడం చాలా మేలు కలిగిస్తుంది.
  • రక్తదానం, రక్తాన్ని చిక్కగా తయారుచేసే మరియు ఉచిత రాడికల్ నష్టం పెంచే ఇనుము స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త దానం చేయడం వల్ల కొత్త బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. రక్తదానం చేసిన తర్వాత 48 గంటల్లో బోన్ మారో సహాయం తో బాడీ సిస్టం వర్క్ అవుతుంది. కొత్త బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి మరియు పాత రెడ్ బ్లడ్ సెల్స్ రీప్లేస్ అవుతాయి.
  • ఇది 30 నుంచి 60 రోజుల్లోగా జరుగుతుంది. కాబట్టి రక్త దానం చేయడం వల్ల ఈ విధంగా కూడా దాతలు బెనిఫిట్స్ పొందవచ్చు. 18 -60 వయస్సు ఉండి,50కి.ల పైన బరువు ఉన్న ఒక మంచి ఆరోగ్యమైన వ్యక్తి, 450 మీ.లీ వరకు రక్తం దానం చేయవచ్చు. పురుషులు 3 నెలలకొకసారి రక్తదానం చేయవచ్చు మరియు స్త్రీలు 4 నెలలకొక్కసారి చేయవొచ్చు.

Exit mobile version