Home Health గుండెని ఆరోగ్యాంగా ఉంచడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసా ?

గుండెని ఆరోగ్యాంగా ఉంచడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసా ?

0

మన శరీరంలో అన్ని అవయవాలూ ముఖ్యమైనవే. ప్రధానంగా గుండె, కిడ్నీలు, లివర్ వంటివి అత్యంత ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అయితే అవి ఆరోగ్యంగా ఉన్నాయో లేదో మనకు తెలీదు. ఎందుకంటే మన చేతులూ, కాళ్లలాగా అవి మన కంటికి కనిపించవు కదా. కాబట్టి వాటి విషయంలో మనం శ్రద్ధ వహించాలి. మంచి ఆహారం తినాలి. ఎక్కువ పోషకాలు, విటమిన్లూ, ఖనిజాలు ఉండే ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటివి ఉన్నవారు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. అధిక బరువు ఉండేవారికి కూడా గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. అందువల్ల గుండె విషయంలో అందరమూ జాగ్రత్త పడదాం. అందుకు ఏం చెయ్యాలో తెలుసుకుందాం

Healthy Food For Heartఫ్రైలు, కేకులు, చాక్లేట్లు, స్వీట్లు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ టేస్టీగా ఉంటాయి. కానీ వీటిలో కొవ్వు ఎక్కువ. అది మన గుండెకు ప్రమాదకరం. ఇవి ఎక్కువగా తింటే మన రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరల్లో గడ్డలు కడతాయి. ఏదో ఒక రోజు అదే కొవ్వు రక్త సరఫరాను అడ్డుకుంటుంది. అంతే హార్ట్ ఎటాక్ వచ్చేస్తుంది. అందు వల్ల మనం డేంజర్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. అవసరమైతే నోరు కట్టేసుకోవాలి. అప్పుడప్పుడూ తింటే పర్లేదు గానీ, రోజూ అలాంటివి తింటే గుండెకు మంచిది కాదు. మరి ఎటువంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం.

సాల్మన్ చేపలు:

సాల్మన్ చేపల్లో వుండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ నరాల్లో రక్త సరఫరాను క్రమబద్ధం చేస్తాయి.గుండె ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి. ఇవి శరీరంలో ఇమ్యునిటీ శక్తిని కూడా పెంపొందిస్తాయి. గుండెకు మంచి చేసే కొవ్వును పెంచుతాయి. అంతేకాదు శరీరంలో రక్తం గడ్డకట్టకుండా వుండేందుకు ఇది ఎంతో అవసరం.

ఓట్స్:

ఈ మద్య కాలంలో గుండెజబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి ఓట్స్ ని వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిజంగా ఓట్స్ కొలెస్ట్రాల్ ని నియంత్రించే శక్తి ఉందా అంటే ఉందనే చెప్పాలి. వీటిల్లో ఉండే ప్రత్యేక పీచు పదార్థం బెటాగ్లూకాన్. ఇది పైత్య రస ఆమ్లాలతో కలిసి శరీరంలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతుంది. ఇదే రకం పీచు పదార్థం బార్లీలో కూడా ఉంటుంది.

బ్లూబెర్రీస్:

బ్లూ బెర్లీలను తీసుకోవడం వల్ల గుండె పనితీరు సజావుగా ఉంటుంది. అల్పాహారంగా గానీ, మధ్యాహ్న భోజనంలో గానీ. ఫ్రూట్ సలాడ్ రూపంలోగానీ.బ్లూబెర్రీస్ ని తరచుగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు దరిచేరవు.

డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ బార్ లో ఉన్న కొన్ని రసాయనాలు హృదయనాళ వ్యవస్థను సాఫీగా ఉంచుతాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా సహాయపడతాయి. డార్క్ చాక్లెట్ దాదాపు 50% గుండెపోటు,10% హృదయ వ్యాధుల ముప్పు తగ్గిస్తుంది.

సిట్రస్ పండ్లు:

నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్ -ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ వంటివి ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది.

తృణ ధాన్యాలు తప్పనిసరి :

రైస్‌, గోధుమలతోపాటూ రాగులు, జొన్నలు, సజ్జల వంటివి ఈమధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారు. నిజానికి అవి అన్నీ తినాలి కూడా. ఇక వాటిలోనూ ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ వచ్చేసింది. అది రేటు ఎక్కువైనా మన శరీరానికి చాలా మంచిదే.

ఇలా మనం తినే వాటిలో బ్యాలెన్స్‌డ్ ఫుడ్ ఉండేలా చేసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఒక్కసారి బాడీలో ఏదైనా పార్ట్ పాడైతే, ఇక మనకు కలిగే బాధ అంతా ఇంతా కాదు. ముందుగానే జాగ్రత్త పడాల్సింది అని అప్పుడు ఎంతో ఫీల్ అవుతాం. ఆ పరిస్థితి రాకుండా చేసుకుందాం. ముందే జాగ్రత్త పడదాం.

 

Exit mobile version