Home Unknown facts భీష్ముడు ఎక్కడ విద్యను అభ్యసించాడో తెలుసా ?

భీష్ముడు ఎక్కడ విద్యను అభ్యసించాడో తెలుసా ?

0

మహాభారతంలోని పాత్రలలో కెల్లా గొప్ప పాత్ర ఏదంటే అవతార పురుషుడైన కృష్ణుడి తరువాత భీష్ముడే అని చెప్పవచ్చు. మహాభారతంలో భీష్ముడు అంటే తెలియని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. తరచూ పెద్దలను, ఆయా రంగాలలో అపార అనుభవాన్ని గడించిన వారిని చూసి ఆయన భీష్మ పితాహహుడు అంటుంటారు. అంటే ఆయా విద్యలు లేదా పనుల్లో మహా నిపుణుడు/పారంగతుడు అని అర్థం.

Bhishmaభీష్ముడు బహుముఖ ప్రజ్ఞాశాలి. ధర్మాత్ముడు, సత్యనిష్ఠ కలవాడు, అద్వితీయమైన పితృభక్తి కలవాడు, వీరత్వంలో అతనికి అతనే సాటి. అవక్ర పరాక్రమ శాలి, సాక్షాత్తు అవతార పురుషుడయిన పరశురాముడే భీష్ముణ్ని యుద్ధంలో ఓడించలేక పోయాడు. తండ్రి నుంచి ఇచ్ఛామరణం వరం పొందాడు. మరి అంతటి దృఢవత్ర శీలుడైన భీష్ముడు ఎవరు, అతని తల్లితండ్రులెవరు? ఆయన ఎక్కడ విద్యను అభ్యసించాడో ఇప్పుడు తెలుసుకుందాం.

భీష్ముడు అష్టవసువుల్లో ఒకరు. బ్రహ్మ శాపం వల్ల్ల అతను శంతన మహారాజుకు కుమారునిగా జన్మించాడు. అతని తల్లి గంగా దేవి. భీష్ముడు, గంగా మరియు శంతనులకు అష్టమ పుత్రుడు. యువరాజ పట్టాభిషేకం చేయించుకోవాల్సిన అతను తండ్రి కోసం, తండ్రి శంతనుడు ఇష్టపడిన సత్యవతీదేవిని వివాహం చేసుకోవడం కోసం ఆమె తండ్రి దాశరాజు విధించిన షరతులకు కట్టుబడ్డాడు. వివాహం చేసుకోనని భీషణ ప్రతిజ్ఞ చేశాడు.

ఆ జన్మాంతం బ్రహ్మచారీగా ఉండిపోయాడు. చివరకు కురు వంశం అంతరించిపోయే ప్రమాదం ఏర్పడినా, సత్యవతీదేవి చెప్పినా, ఒత్తిడి తెచ్చినా తన ప్రతిజ్ఞను మాత్రం వీడలేదు. ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాడు కనుకే ఆయనకు భీష్ముడు అనే పేరు వచ్చింది. భీష్ముడు భూతభవిష్యద్వర్తమానవేది. సర్వవిద్యలకు ఆధారభూతుడు. ఆయన సకల ధర్మాలను చ్యవన, మార్కండేయుల వద్ద నేర్చుకున్నాడు.

ధర్మరాజుకు సైతం ధర్మాలను ఉపదేశించిన మహా బుద్ధిశాలి. ఒకానొక సందర్భంలో గురువు దోష దూషితుడైనప్పుడు ఆ దోషాన్ని గుర్తుకు తెచ్చి అతనికి కనువిప్పు కలిగిండచం శిష్యుని ధర్మం. శిఖండిని ఉద్దరించడానికి పోటీపడి తన గురువైన పరుశరామునికి ధర్మతత్తాన్ని వివరించి గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నాడు. అంటే దీన్ని బట్టి భీష్మునికి గురువు ఒక్కరు కాదు ముగ్గురు. చ్యవనుడు, మార్కండేయుడు, పరుశరాముడు. భీష్ముడు వంటి ధర్మజ్ఞుడు శిష్యుడు కావడం వల్ల పరుశరామునికి కీర్తి కలిగింది.

 

Exit mobile version