హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిది ఎలా చేయాలో శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి ఈ విషయాలు తెలియదు. ముఖ్యంగా చెప్పే వాళ్ళు లేరు. చెప్పేవారు ఉన్న తెలుసుకునే పొజిషన్లో ఎవరూ లేరు. ఎవరి బిజీలో వారు నిమగ్నమై ఉన్నారు. ఎవర్ని తప్పుపట్టలేం కానీ.. మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడం మన కర్తవ్యం మన ధర్మం.
హిందు ధర్మ శాస్త్ర ప్రకారం కొన్ని వస్తువులను చాలా పవిత్రంగా చూసుకుంటాం. ఆ వస్తువులను అశుభ్రమైన ప్రదేశంలో గాని, కింద గాని పెట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. పూజకు ఉపయోగించే పూలు, కొబ్బరికాయ, అగర్‌బత్తీలు, కర్పూరం వంటివి కింద పెట్టం. ఒకవేళ పొరపాటున కింద పెడితే వాటిని పూజకు ఉపయోగించము.
ఇవే కాకుండా హిందూ దర్శశాస్త్రం ప్రకారం కింద పెట్టకూడని మరి కొన్ని వస్తువులు ఉన్నాయి. వీటిని కింద పెడితే అశుభం జరుగుతుందని నమ్ముతారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం
జంధ్యం :
హిందువుల్లో చాలా మందికి జంధ్యం ధరించే ఆచారం మరియు సాంప్రదాయం ఉంటుంది. జంధ్యాన్ని తల్లిదండ్రులు, గురువులకు ప్రతి రూపంగా భావిస్తారట.
అందువల్ల జంధ్యంను కింద పెడితే వారిని అవమానించినట్టే అవుతుందట.అం దువల్ల దాన్ని ఎప్పుడూ నేలపై పెట్టకూడదు.
సాలిగ్రామం విష్ణువుకు ప్రతిరూపం. అందువల్ల సాలిగ్రామాన్ని కింద పెడితే సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు.
దేవుడి ముందు పెట్టే దీపాలను నేలపై పెట్టరాదు. వాటిని వెలిగించినప్పుడు దీపం కింద పళ్లెం లేదా తమలపాకు పెట్టాలి. ఒకవేళ నేలపైనా పెడితే దేవతలను అవమానించినట్టే అవుతుందట.
బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ రూపంగా చూస్తారు. అటువంటి బంగారాన్ని నేలపై పెడితే, లక్ష్మిదేవి ఆగ్రహానికి లోనై అనేక కష్టాలు పడతారు.
శంఖువులో సాక్షాత్తూ లక్ష్మీ దేవి కొలువై ఉంటుందట.
అందువల్ల దాన్ని కూడా నేలపై పెట్టరాదు. ఒకవేళ పెడితే ఆర్థిక సమస్యలు కలుగుతాయట.