Home Health ఈ లక్షణాలు ఉంటె మీకు డయాబెటిస్ ఉన్నట్టే

ఈ లక్షణాలు ఉంటె మీకు డయాబెటిస్ ఉన్నట్టే

0

ఈ రోజుల్లో తక్కువ వయస్సు ఉన్నవారిని సైతం వేధిస్తున్న వ్యాధి మధుమేహం. శరీరంలో ఉండే చక్కెర (గ్లూకోజ్) హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. మధుమేహం మీపై దాడి చేసే అవకాశాన్ని అస్సలు ఇవ్వొద్దు. ఒకసారి వచ్చిందంటే దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ మధుమేహం గురించి ముందస్తు లక్షణాలు, జాగ్రత్తలు తప్పకుండా తెలుసుకోవలసిందే.

Symptoms of diabetesఎందుకంటే ఒకసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే నరకమే, ఏ పని చేయలేము, అలసట, అలాగే ఏ స్వీట్ తినలేము అతిగా ఏ ఫుడ్ తీసుకోకూడదు… ఇలా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారపు అలవాట్లు పూర్తిగా మార్చుకోవాలి. అందుకే షుగర్ సమస్య రాకుండా జాగ్రత్త పడాలి. ముందు టెన్షన్ అనేది ఉండకూడదు. అలాగే భారీ ఊబకాయం లేకుండా చూసుకోవాలి.

డయాబెటీస్ వచ్చే ముందు ఎలాంటి సింటమ్స్ కనిపిస్తాయి, దానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక లక్షణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం….

->చేతులు, కాళ్లు, పాదాలు, ముంజేతులు వద్ద బొబ్బలు ఏర్పడతాయి. ఇలాంటివి వచ్చి తగ్గకుండా ఉన్నా నొప్పి లేకుండా ఉన్నా ఇది మధుమేహానికి ప్రాధమిక సూచన అని చెబుతున్నారు నిపుణులు.

->అలాగే చర్మంపై పసుపు, ఎరుపు లేదా గోదుమ రంగు మచ్చలు, మెడ దగ్గర నల్లటి మచ్చలు వచ్చినా తగ్గకుండా సురీడుకాయల్లా చిన్నగా వస్తూ ఉన్నా ఇది ఓ లక్షణం.

-> చర్మం విపరీతమైన దురదపుట్టి అస్సలు తగ్గకపోయినా ఇది కాస్త అనుమానించాల్సిందే.

->అలాగే ఏదైనా గాయం తగిలితే అస్సలు తగ్గకుండా పుండు పుడుతోంది అంటే షుగర్ సమస్య కింద అనుమానించాల్సిందే.

->అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన అది కచ్చితంగా షుగర్ అని భావించవద్దు, వైద్యులని సంప్రదించి మీ అనుమానం నివృత్తి చేసుకోండి.

 

Exit mobile version