Home Health తల మీద మొటిమలను తగ్గించే సులువైన పద్ధతులు

తల మీద మొటిమలను తగ్గించే సులువైన పద్ధతులు

0

మొటిమలు శరీరం, తల మీద చర్మం మరియు శరీరం యొక్క అనేక బాగాలపై కనపడతాయి. తలా మీద మొటిమలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ సమస్యకు ఒత్తిడి, అలసట మరియు నిస్పృహ కూడా కారణం అవుతాయి. మొటిమలు హార్మోన్ల మార్పులు, అనారోగ్యకరమైన ఆహారం, అలెర్జీ, ఆర్ద్ర పరిస్థితులు, కాలుష్యం మరియు కొన్ని రసాయనాల కారణంగా ఏర్పడతాయి. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కొన్ని సహజ నివారణలు తెలుసుకుందాం.

Tips to reduce pimples on the headతల మీద మొటిమలను తొలగించటానికి కలబంద బాగా సహాయపడుతుంది. జుట్టు యొక్క pH సంతులనం చేసి మొటిమలకు కారణం అయిన బాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, అనస్తీషియా, క్రిమినాశక మరియు యాంటీమైక్రోబియాల్ లక్షణాలు ఉండటం వలన జుట్టు మరియు చర్మ సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది. కలబంద జెల్ ని ప్రభావిత ప్రాంతంలో ప్రతి రోజు 2 సార్లు రాయాలి. అరకప్పు కలబంద జెల్ లో నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని తడి తల మీద రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

ఆపిల్ సైడర్ వినెగర్ కూడా తల మీద మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు జుట్టులో మొటిమలకు కారణం అయిన బ్యాక్టీరియాను క్లియర్ చేయటంలో సహాయం చేస్తాయి. అంతేకాక జుట్టు యొక్క pH లెవల్స్ ను సంతులనం చేసి జుట్టు బ్రేక్ అవుట్స్ ని నిరోదిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ ని కలిపి ఈ మిశ్రమాన్ని తల మీద రాసి 5 నిముషాలు అయ్యాక తలస్నానం చేయాలి.

టీ ట్రీ ఆయిల్ మొటిమలు మరియు ఇతర చర్మ సమస్యలను సమర్థవంతముగా నివారిస్తుంది. ఈ నూనెలో ఏంటి సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన చర్మ రంద్రాలను డ్రై గా చేసి మొటిమలను తగ్గిస్తుంది. 2 స్పూన్ల ఆలివ్ లేదా కొబ్బరి నూనెలో 5 చుక్కల టీ ట్రీ ఆయిల్ ని కలిపి ఈ మిశ్రమాన్ని తలకు మసాజ్ చేసి 2 గంటల తర్వాత శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా వాడే షాంపూలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ని కలిపి జుట్టు శుభ్రం చేయడం వల్ల తలలో ఉండే మొటిమలు తగ్గుముఖం పడతాయి.

 

Exit mobile version