స్వామీజీలు వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా చేతిలో పొడవాటి కర్రలు ఎల్లవేళలా పట్టుకుంటారు. ఈ కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. మరి ఏకదండి, ద్విదండి, త్రిదండి అంటే ఏంటి? వాటిని పట్టుకోవడం వెనుక కారణాలు ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏకదండి: ఒక కర్రను ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు. శ్రీ ఆది శంకరాచార్యులు వారు ఏకదండి కలిగి ఉంటారు. అయితే అద్వైతం అనగా జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది.
ద్విదండి:రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు మధ్వాచార్యులు. వీరిని ద్విదండి స్వాములు అంటారు. వీరు విష్ణుభక్తులు. వీరు దేవుడు వేరు జీవుడు వేరు అని బోధిస్తారు. జీవాత్మ, పరమాత్మ వేరువేరు అనే ఈ సిద్ధాంతాన్నే శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తాడు.
త్రిదండి:మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు, దీనిని తత్వత్రయం అంటారు. ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు. వీరిది రామానుజాచార్యుల పరంపర. శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుండి విముక్తులై, మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధా్దంతాన్ని బోధిస్తారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.