కింద జారిపడగానే కాలో, చెయ్యో సులభంగా విరిగిపోతుంది కొందరికి. పిల్లలైతే ఆడుకుంటూ ఎముకలు విరగ్గొట్టుకునే సందర్భాలు ఎన్నో. వయసు మీద పడిన వాళ్లైతే చాలా సార్లు బాత్రూముల్లో జారి పడి గాయాలపాలవుతారు. వయసు మీరాక కీళ్లు, మోకాళ్ల నొప్పులు మామూలే. ప్రమాదాల్లో దెబ్బతగిలేది ఎముకలకే. అయితే ఎముకలు బలంగా ఉన్నప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరిగినా ఎముకలు విరిగి పోకుండా ఉంటాయి. అందుకే ఎముకల్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం.
శరీరానికి అసలైన నిర్మాణాన్ని ఇచ్చేవి ఎముకలే. ఇవి బలంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు. ఇవి కూడా ఎప్పటికప్పుడు కొత్తగా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. ముప్పయ్యేళ్ల వరకు ఎముకల అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఆ తర్వాత వాటిలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆపై వయసు పెరిగేకొద్దీ ఎముకలు బలహీనమవుతాయి. అయితే సరైన పోషకాహారం తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వయసుతోపాటు వచ్చే కీళ్లు, మోకాళ్ల అరుగుదలకి చెక్ పెట్టొచ్చు. పిల్లల్లో ఎముకలకు తగిన పోషణ అందిస్తే వాళ్లలో ఎదుగుదల బాగుంటుంది. వృద్ధులైతే గాయాలపాలు కాకుండా చూసుకోవచ్చు.అయితే మనం రోజు తీసుకునే ఎటువంటి ఆహారంలో కాల్షియం లభిస్తుందో చూద్దాం.
ప్రొటీన్:
ఎముకల్లో యాభై శాతం ప్రొటీన్ ఉంటుంది. అందువల్ల ఎముకల ఆరోగ్యానికి ప్రొటీన్ తప్పనిసరి. ప్రొటీన్ తగ్గితే క్యాల్షియం కూడా తగ్గుతుంది. ఎందుకంటే ప్రొటీన్ తగ్గడం వల్ల శరీరం క్యాల్షియంను గ్రహించే శక్తిని కోల్పోతుంది. పెద్దవాళ్లు సగటున రోజుకు వంద గ్రాములకుపైగా ప్రొటీన్ తీసుకోవాలి. ప్రొటీన్ తగినంత తీసుకుంటే స్త్రీలలో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
పాలు:
పాలలో కాల్షియం ఎక్కువ. రోజూ పాలు తాగితే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా అవుతాయి.
నారింజ:
నారింజల్లో కాల్షియం ఎక్కువ. ఒక నారింజ పండులో 60 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే వాటిలోని విటమిన్ D, సిట్రస్ శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
బాదం:
బాదం పప్పులు తింటే ఎన్నో లాభాలు. ఓ కప్పు వేపిన బాదం పప్పుల్లో 457ml కాల్షియం ఉంటుంది. ఇది బోన్లకు బలమే కాదు, బాడీలో ప్రోటీన్లను కూడా పెంచుతుంది
అంజీర పండ్లు:
తరచుగా అంజీర పండ్లు డ్రై అంజీర అయినా సరే తింటే బాడీలో కాల్షియం పెరుగుతుంది. ఓ కప్పు అంజీరలో 242ml ఉంటుంది. తరచూ అంజీర తింటే ఎముకలు గట్టిగా అవుతాయి.
పెరుగు:
పెరుగులో కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. కొంత మందికి పాల రుచి నచ్చదు. వారు పెరుగు తినడం ద్వారా కాల్షియం పెంచుకోవచ్చు. అంతే కాకుండా పాలతో తయారుచేసే సీట్లు, జున్ను ఇతర పదార్థాల్లో కాల్షియం ఉంటుంది. వెన్నలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఎముకల్ని పటిష్టంగా చేస్తుంది.