Home Health జుట్టుతో పాటు చర్మ సమస్యలను దూరం చేసే జొజోబా ఆయిల్ గురించి విన్నారా?

జుట్టుతో పాటు చర్మ సమస్యలను దూరం చేసే జొజోబా ఆయిల్ గురించి విన్నారా?

0

వ్యావహారికంగా హొహోబా అని పిలవబడే జొజోబా నూనె గురించి మ‌న‌లో చాలా మందికి తెలియదు. సౌందర్య పోషణ విశేష స్థానం కలిగిన నూనెగా జొజోబా ను చెప్పుకోవచ్చు. జొజోబామొక్క గింజల నుండి ఈ నూనెను వెలికి తీస్తారు. ఇవి ఎక్కువగా అమెరికన్‌ ఎడారులో పెరుగుతుంది. దీనిని పిగ్నట్, కాఫీబెర్రీ, డీర్ నట్ అని కూడా వ్యవహరిస్తారు. అనేక శతాబ్దాలుగా అమెరికన్లు ఈ నూనెను చర్మము, శిరోజాల సమస్యలకు వాడుతున్నారు. ఇప్పుడు మనదేశంలో కూడా చర్మం, కురులను సంరక్షించే ఉత్పత్తుల తయారీలో జొజోబా నూనెను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనిలో ఉన్న విటమిన్ ఇ, బీ5 చర్మంపై ఏర్పడిన సన్నని గీతలు, ముడతలను తగ్గించి సున్నితంగా మార్చేస్తుంది. అందుకే దీన్ని స్కిన్ టోనర్‌గానూ ఉపయోగిస్తారు. చర్మము లోని సెభాషియస్ గ్లాండ్స్ విడుదల చేసే సీబమ్ తో జొజోబా ఆయిల్ సరిపోలిఉంటుంది. కాబట్టి ఇది సీబమ్(sebum)లా పనిచేసి చర్మానికి సహజ మెరుపును అందిస్తుంది. దీనిని లిక్విడ్ వ్యాక్స్ గా చెబుతుంటారు.

Health Benfits of Jojoba oilవయసు పెరిగే కొద్దీ చర్మగ్రంథుల నుంచి సీబమ్ ఉత్పత్తి తగ్గిపోతుంటుంది. దీనివల్ల చర్మం నిర్జీవంగా తయారవుతుంది. అందుకే స్కిన్ కేర్ రొటీన్‌లో జొజోబా ఆయిల్‌ను భాగం చేసుకొంటే.. చర్మం మాయిశ్చరైజ్ అవ్వడంతో పాటు సాఫ్ట్‌గా తయారవుతుంది. జొజోబా నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల ఎటువంటి చర్మతత్వం కలిగినవారైనా దానిని ఉపయోగించవచ్చు. జొజోబా నూనెలో విటమిన్ బి, సి, ఇల తో పాటుగా ఖనిజ లవణాలైన కాపర్, జింక్ పుష్కలంగా ఉంటాయి.

Health Benfits of Jojoba oilకాబట్టి చర్మానికి తగిన పోషణ అందుతుంది. దీనిలో ఉన్న హీలింగ్ ప్రోపర్టీస్ సీబమ్ ఉత్పత్తిని క్రమబద్ధం చేస్తాయి. అలాగే చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి మృదువుగా మారుస్తాయి. జొజోబా ఆయిల్ ఉపయోగాలు చర్మం వరకే పరిమితవ్వలేదు. ఇది జుట్టుకి సైతం పోషణ ఇచ్చి బలంగా మారుస్తుంది. తలకు రాసుకొంటే స్కాల్ఫ్ సమస్యలు తగ్గుముఖం పడతాయి. కురులు బలంగా తయారవుతాయి. రాలిన జుట్టు స్థానంతో కొత్త వెంట్రుక‌లు పుట్టుకొస్తాయి.

వాతావరణ కాలుష్యం, రసాయనాలతో నిండిన సబ్బులు, షాంపూలు, ఇతర సౌందర్య ఉత్పత్తులు, వేణ్నీళ్ల స్నానం.. మొద‌లైన వాటి వ‌ల్ల‌ చర్మ ఆరోగ్యం దెబ్బ తింటుంది. చర్మంపై ఉండే సహజనూనెలు తొలిగిపోయి పొడిగా, కళావిహీనంగా తయారవుతుంది. రోజంతా ఎయిర్ కండిషన్డ్ గదిలో గడిపేవారి చర్మం సైతం తరచూ పొడిగా మారిపోతుంటుంది. సీబమ్, పీహెచ్ విలువల సమతౌల్యం దెబ్బతింటుంది. చర్మం జిడ్డుగా లేదా పొడిగా మారిపోవడం, మొటిమలు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటప్పుడు జొజోబా ఆయిల్ ని మాయిశ్చరైజర్‌గా రోజూ ఉపయోగిస్తే చర్మం ఎప్పటి లాగే సౌందర్యవంతంగా తయారవుతుంది. ఇది చర్మంపై పొరలా ఏర్పడి తేమ కోల్పోకుండా చేస్తుంది. సీబమ్ మాదిరిగా పనిచేస్తుంది కాబట్టి చర్మం పొడిగా మారదు. అలాగే సీబమ్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది కాబట్టి.. జిడ్డుగానూ తయారవ్వదు. కాబట్టి దీన్ని ముఖానికి, చర్మానికి కూడా ఎలాంటి సందేహం లేకుండా అప్లై చేసుకోవచ్చు.

జొజోబా నూనెలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల చర్మంపై ఉన్న మొటిమలు, గాయాలు, వాటి కారణంగా ఏర్పడిన మచ్చలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి. అసలే జిడ్డుగా ఉన్న చర్మానికి నూనె రాస్తే ఇంకా జిడ్డుగా మారిపోతుందేమో? మొటిమలు ఎక్కువైపోతాయేమోననే సందేహం మీకు రావచ్చు. కానీ జొజోబా ఆయిల్‌లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల ఇలా జరిగే అవకాశమే ఉండదు. పైగా మొటిమలు తగ్గుముఖం పడతాయి. జొజోబా నూనె మొటిమలు రావడానికి కారణమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అందుకే మొటిమలు, మొటిమలు రావడానికి అవకాశం ఉన్న చర్మం కలిగినవారు దీన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. జొజోబా నూనె తేలిక స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు రాసుకొన్న తర్వాత జిడ్డుగా అనిపించదు. కాబట్టి అసౌకర్యంగా అనిపించదు.

జొజోబా ఆయిల్ హానికరమైనది కాకపోయినప్పటికీ మాడు పై మొదటిసారిగా వాడుతున్నప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం అవసరం. ఒక్కోసారి ఎలర్జిక్ రియాక్షన్‌ వచ్చే అవకాశమూ ఉంది. ఇది కూడా కొబ్బరి నూనె లాగనే దీర్ఘకాలిక మన్నిక కలిగిఉంటుంది. గాలి తగలని ప్రదేశంలో పెట్టుకొని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు.

 

Exit mobile version