Home Health చామ దుంపలను తరచూ ఆహారంలోకి తీసుకోవడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా ?

చామ దుంపలను తరచూ ఆహారంలోకి తీసుకోవడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా ?

0

దుంప కూరగాయల్లో కొన్నిటిని ఉడికించుకొని తింటే మరికొన్ని పచ్చిగానే తినేయొచ్చు. కొన్నిటిని కూర వండుకునే తినాలి. వాటిలో చామదుంప కూడా ఒకటి. చాలా మంది చామదుంపలు బాగా జిగురుగా ఉంటాయనే కారణంతో వాటిని తినేందుకు ఇష్టపడరు. కానీ ఇతర దుంపలతో పోలిస్తే చామదుంపల్లోనూ మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి.

Excellent uses of chamomileమాంసానికి బదులుగా చామగడ్డను తింటారు. ఇవి మంచి రుచినీ, పోషకాలనీ ఇస్తాయి. 100 గ్రాముల చామదుంపల్లో దాదాపు 120 కేలరీల శక్తి ఉంటుంది. చామ దుంపలను తరచూ ఆహారంలోకి తీసుకోవడం వలన మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాం.

చామదుంపల్లో ఎక్కువ కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ దొరుకుతాయి. పీచు పదార్థాన్ని నెమ్మదిగా జీర్ణం చేస్తూ రక్తప్రసరణలోకి గ్లూకోజ్‌ను స్థిరంగా విడుదల చేస్తాయి. అందువల్ల షుగర్ లెవెల్స్ సడెన్‌గా పెరగవు. పైగా వీటివల్ల బాడీలో ఎనర్జీ ఎక్కువసేపు ఉంటుంది.

అధిక బరువు తగ్గాలనుకునే వారు చామదుంపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తినడం వల్ల గుండెకు కావల్సిన పోషకాలు అందుతాయి. చామదుంపల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.

ఈ దుంపల్లో ఉండే విటమిన్ బి6 హైబీపీని తగ్గిస్తుంది. చామ దుంపల వల్ల మహిళల ఎండోక్రైన్‌ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. మెనోపాజ్‌ తర్వాత ఈ దుంపలు మంచి ప్రభావం చూపిస్తాయి. రాత్రివేళ చెమట, తడి ఆరటం, హాట్‌ ప్లషెస్‌ వంటి లక్షణాలు చేమదుంపల వల్ల తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. హార్మోన్‌ రిప్లేస్‌మెంట్‌ థెరపీకి ఇవి ప్రత్యామ్నాయం.

డియోజెనిన్‌ అనే కెమికల్‌లో ఉండే యాంటీ-ఇన్‌ప్లమేటరీ, యాంటీ-స్పాజ్మాడిక్‌, యాంటీ-ఆక్సిడెంట్‌ గుణాలు ఈ దుంపల్లో లభిస్తాయి. ఋతుసంబంధిత క్రాంప్స్‌, ఆర్థరైటిస్‌ నొప్పులు, కండరాల అలసట తగ్గించడానికి, ఉత్తమ నెర్వట్రాన్స్‌మిషన్‌కు సహకరిస్తాయి. గర్భిణీలకు నీరు పట్టడం, ఉదయం వేళ వికారం వంటి లక్షణాలను చామదుంపలు తగ్గిస్తాయి.

చామదుంప తిన్న ఆహారం సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుంది. వీటిలోని డైటరీ ఫైబర్‌ మలబద్ధకాన్ని తగ్గించి, విష పదార్థాలు పేరుకుపోకుండా కాపాడుతుంది. కొలన్‌ క్యాన్సర్‌, ఇర్రిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.

 

Exit mobile version