తమలపాకులు ఆయుర్వేదంలో కీలకపాత్ర పోషిస్తాయి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. తమలపాకులను ఎక్కువ భోజనం తరువాత కిళ్లీ వేసుకోవడం కోసం వాడుతుంటాం… అయితే తమలపాకులను కిళ్లీ కోసమే కాదు… పూజకు, శుభకార్యాలకు కూడా వాడుతారు. అందువల్ల వాటికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.
- తమలపాకులను చర్మ సౌందర్యం కోసం కూడా వాడుతుంటారు… నిజానికి తమలపాకులతో మన చర్మం మెరుస్తుంది అనే విషయం చాలా మందికి తెలియదు. తమలపాకుల్లో యాంటీఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అవి చర్మంపై ఉండే మృత కణాలను తొలగిస్తాయి. మృతకణాలు తొలగిపోగానే… చర్మానికి స్వేచ్ఛ లభించినట్లు అవుతుంది. వెంటనే కొత్త కణాలు… మెరుస్తూ పుడతాయి. ఇలా సరికొత్త మెరిసే చర్మం వస్తుంది. అలా వచ్చేందుకు తమలపాకుల్లోని పోషకాలు సహకరిస్తాయి.
- ఓ టీ స్పూన్ తెనెను తమలపాకులకు రాసి… వాటిని ముఖానికి అద్దుకోండి. ఓ పావు గంట అలా ఉండండి. తర్వాత వాటిని తొలగించి… కొద్దిగా వేడిగా ఉన్న నీటితో కడగండి. లేదంటే… తమలపాకులను జ్యూస్‌లా చేసి… ఆ రసంలో తేనె కలిపి కూడా పేస్టులా రాసుకోవచ్చు. ఎలా చేసినా మేలే జరుగుతుంది.
- ఇలా వారానికి రెండు సార్లు చెయ్యాలి. తద్వారా కొత్త చర్మం రావడమే కాదు… కాంతివంతమైన స్కిన్ వస్తుంది. పైగా ఎంతో మృదువుగా ఉంటుంది కూడా. తమలపాకులను నీటిలో ఉడికించి… ఆ నీరు చల్లారిన తర్వాత ముఖాన్ని కడుక్కుంటే కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇలా ఎన్నిసార్లు చేస్తే… అంతలా ముఖం మెరుస్తుంది.
- తమలపాకులతో పేస్ ప్యాక్ లు కూడా వేసుకోవచ్చట. కొన్ని తమలపాకులను మిక్సీ లో వేసి పేస్ట్ గా చేసుకుని దానికి తేనె, చార్‌కోల్ కలిపి, కాలిన గాయాల పై రాసుకుంటే, చాల త్వరగా గాయాలు తగ్గిపోతాయి. ముఖంపై మచ్చలు, మొటిమల ఉన్న కూడా ఇవి బాగా పనిచేస్తాయి.
తమలపాకు రసాన్ని వేడి చేసి, చల్లారిన తర్వాత తేనె కలిపి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. తేనె కలపకుండా కూడా రాసుకోవచ్చుకాకపోతే తేనె కలిపితే కాస్త పేస్టుల తయారయి కారిపోయి కిందకు వచ్చేయకుండా కాసేపు అలాగే పట్టి ఉంటుంది. పావుగంట తర్వాత నీటి తో కడిగేసుకుంటే చాలు.