Home Unknown facts స్త్రీకి వంద సంవత్సరాలు ఐదవతనం చేకూర్చే పసుపు గౌరీ వ్రతం

స్త్రీకి వంద సంవత్సరాలు ఐదవతనం చేకూర్చే పసుపు గౌరీ వ్రతం

0

ఎన్నో నోములు, ఎన్నో వ్రతాలు ఏదీ స్వార్ధానికి కాకుండా భర్త కోసం, సంతానం కోసం, కుటుంబ యోగక్షేమాల కోసం చేస్తారు స్త్రీ మూర్తులు. అటువంటిదే ఈ పసుపు గౌరీ వ్రతం. భర్త నిండు నూరేళ్లు బ్రతకాలని చేసే ఈ వ్రత కథ ఏంటో తెలుసుకుందాం.

pasupu Gowri vratamనూరు పసుపు కొమ్ములతో వందరోజులు నోము పట్టే స్త్రీకి వంద సంవత్సరాలు ఐదవతనం ఉంటుంది. ఒక ఊరిలో వేద పండితుని కుమార్తె పసుపు గౌరీనోము పట్టింది. దానిలో నియమం తప్పడం వల్ల ఆమెకు పుట్టిన సంతానం చనిపోతారు.

అందువల్ల విచారంలో కుంగిపోయిన పార్వతి పరమేశ్వరులను భక్తితో తలుచుకుంది. ఆమె దగ్గరికి పరమేశ్వరుడు వృద్ధుని రూపంలో వచ్చి అమ్మా నీవు పూర్వం పసుపుగౌరీ నోము పట్టి నియమం తప్పావు. అందువలనే నీ సంతానం నష్టమౌతుంది. అందుచేత నిష్టతో నోము పట్టమని చెప్పాడు. దీంతో వేదపండితుని భార్య నియమనిష్టలతో నోము ఒక సంవత్సరం పట్టింది.

ఒక కిలో పసుపు, ఒక కిలో కుంకుమ, వెండి గౌరీ ప్రతిమ చేయించి దానికి ఒక సంవత్సరం పూజ చేసి సంవత్సరం తరువాత ఒక ముత్తయిదువుకు జాకెట్ బట్ట దక్షిణ తాంబూలాలతో వాయనం ఇచ్చింది. దీంతో ఆమెకు తిరిగి సంతానం కలిగింది, దీర్ఘ సుమంగళిగా జీవించింది.

Exit mobile version