Home Unknown facts మంగళవారం రోజు చేయకూడని కొన్ని పనులు ఏంటో తెలుసా

మంగళవారం రోజు చేయకూడని కొన్ని పనులు ఏంటో తెలుసా

0

మంగళవారం ఆంజనేయస్వామికి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజున వీరాంజనేయుడిని ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. ఆరోజున స్వామివారి దర్శనం చేసుకున్నా, పూజ చేసినా మంచి జరుగుతుంది. ఆంజనేయ స్తోత్రం పఠించడం వల్ల ఏలాంటి పీడ కలలు రావు. అదేవిధంగా ఈ రోజు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి.

New Clothesముఖ్యంగా కొత్తబట్టలు కొనకూడదు, కొత్త బట్టలు వేసుకోకూడదు అని చెబుతారు. అలా చేస్తే కీడు జరుగుతుందని మన పెద్దవారు అంటూ ఉంటారు. ఈ రోజు నూతన బట్టలు ధరించడం వల్ల అవి ఇతర కారణాల వల్ల ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఈ రోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు.

వారంలో మూడో రోజైన మంగళవారం రోజుకు అధిపతి కుజుడు. కుజుడు కోపానికి, పాపాలకు, ప్రమాదాలకు ప్రతీక అని చెబుతారు. అందువల్ల మంగళవారం రోజున ఎటువంటి శుభకార్యాలు తలపెట్టిన ఏదో కారణం చేత ఆగిపోతూ వుంటాయి. మంగళవారం కొత్త బట్టలు వేసుకుంటే ఎక్కువ కాలం మన్నిక ఉండవు అని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా కొత్త బట్టలు ధరించి శుభకార్యాలు చేసిన అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుందట.

శనితో సంబంధమున్నందన మంగళవారం నూతన దుస్తులుతో పాటు కొత్త బూట్లను కూడా ధరించకూడదు. నూతన బూట్లు వేసుకోవడం వల్ల గాయాలవుతాయి. అంతేకాకుండా డబ్బు కోల్పోయే ప్రమాదముందని విశ్వసిస్తారు. మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్, మాలిష్ లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశముంటుంది.

అలాగే మంగళవారం రోజు ఎవరి దగ్గర నుంచి డబ్బును తీసుకోకూడదు ఒకవేళ తీసుకుంటే అవసరానికి కాకుండా వృధాగా ఖర్చు అయిపోతుంది. అంతేకాకుండా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. ఆర్థికం పురోగతి కోసం మంగళవారం నుదిటిపై కుంకుమ లేదా పసుపును తిలకంగా దిద్దుకోవాలి.

ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా జ్ఞానాన్ని ప్రసాదించే గణేశుని ఆశీర్వాదాలను కూడా పొందుతారు. ఫలితంగా సంపద, శోభ, మానసిక ప్రశాంతతతో పాటు సుఖసంతోషాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

 

Exit mobile version