Home Unknown facts శాఖ దానము నోము వలన కలిగే ఫలితాలు

శాఖ దానము నోము వలన కలిగే ఫలితాలు

0

శాఖ ధానము నోము గురించి చాలా మందికి అవగాహన ఉండదు. కానీ ఇది చాలా సులభంగా చేసుకోగలిగే నోము. కేవలం తోటకూర చెట్లను దానం ఇవ్వడం ద్వారా ఈ నోమును చేయవచ్చు.

పూర్వము ఒక రాజ్యంలో రాజు భార్య మంత్రి భార్య కలిసి శాఖ దానము నోమును నోచారు. ఒక సంవత్సరము పాటు మంత్రి భార్య ప్రతి రోజు ఒక తోటకూర చెట్టును కొంత దక్షిణతో కలిపి ఒక విప్రునికి (బ్రాహ్మణునికి) దానమిస్తుండేది. రాజు భార్య సంవత్సరానికి సరిపడు తోటకూర చెట్లు తెప్పించి విప్రులను రప్పించి వారికి దక్షిణ తామ్బూలాదులతో ఒక్క సారిగా దానమిచ్చింది. కాలం గడుస్తున్నా కొద్ది మంత్రి భార్య సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తుంది. రాజు భార్యకు సుఖ శాంతులు లేక కష్టాలతో జీవిస్తుండేది.

Facts About shakadana Nomuఈ విషయం గురించి మంత్రి భార్య దగ్గరికి వెళ్లి చెప్పి మనం ఇద్దరం శాఖ దానము నోము చేసాం కదా! మరి నీకు సుఖ శాంతులు కలగడానికి కారణం ఏంటి ? అని ప్రశ్నించింది. అందుకా మంత్రి భార్య మహారాణి ఒక్క సారిగా వ్రతాన్ని పూర్తి చేయాలన్న తొందరపాటు భావంతో మీరు వ్రత నియమాన్ని కూడా ఉల్లంఘించి సంవత్సరం రోజులపాటు ప్రతీ రోజు పంచవలసిన తోటకూర చెట్లను దక్షిణ ను ఒకే రోజు పంచడం వల్ల వ్రత విధి విదానాలను ఆచరించకుండా వ్రతాన్ని పూర్తి చేసినందువల్ల మీకు మనఃశాంతి లోపించి దుఃఖం, కష్టాలు కలుగుతున్నాయి.

మళ్ళీ శాఖ దానము నోమును నోచి భక్తితో ప్రతి రోజు శాఖాన్ని దక్షినలతో కలిపి ఏడాదిపాటు దానం చేయమని మంత్రి భార్య రాజు భార్యకు చెప్పింది. ఆమె మాటల మీద నమ్మకం వుంచి రాజు భార్య శాఖ దాన నోమును భక్తితో విది విధానాలతో నియమం తో పూర్తి చేసినందువల్ల ఆమె స్థితి మారి కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించింది.

ఉద్యాపన: ఒక బ్రాహ్మణుడిని పిలిచి తలంటి నీళ్ళు పోసి తోటకూర చెట్టును పదమూడు నాణాలను దక్షిణగా ఆ విప్రునికి దానమివ్వాలి.

 

Exit mobile version